2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఘోరంగా ఓటమి చెందడంతో ఏకంగా 23 ఎమ్మెల్యేల స్థానాలకు తెలుగుదేశం పార్టీ పడిపోవడంతో రాజకీయంగా చంద్రబాబు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో జగన్ వేస్తున్న ఎత్తుగడలకు చంద్రబాబు తల్లడిల్లి పోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అనేక విదేశీ పర్యటనలకు స్పెషల్ ఫ్లైట్ కేటాయించుకుని తెగ చక్కెర్లు కొట్టేవారు.

 

అయితే తాజాగా మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ప్రపంచ ఆర్థిక సమావేశాలకు దావోస్ పట్టణం స్విట్జర్లాండ్‌లో జరిగే వేడుకలకు హాజరయ్యే చంద్రబాబు తాజాగా అధికారంలో లేకపోవడంతో ప్రస్తుతం దావోస్ ..స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక సమావేశాలు జరుగుతున్న కానీ వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలో వికేంద్రీకరణ బిల్లు విషయంలో అదే విధంగా శాసనమండలి రద్దు విషయంలో సోమవారం కూడా అసెంబ్లీ జరిగే అవకాశాలు ఉంటున్న తరుణంలో చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం.

 

అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ...అసెంబ్లీ సమావేశాలు కారణంగా కాదు పవర్ లేక చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సమావేశాలకు హాజరు కావడం లేదని ...ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు అంటే ప్రత్యేక విమానంలో స్విట్జర్లాండ్‌లో చంద్రబాబు ఉండేవారు...ప్రజాసంక్షేమం తక్కువ ఖర్చుపెట్టే చంద్రబాబు ఇతర విదేశీ టూర్లకు వెళ్లడానికి ప్రత్యేక విమానాలు విషయంలో ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే..చంద్రబాబుకి దుబారా ఖర్చులు ఎక్కువ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

ఇదిలా ఉండగా ఇదే సమావేశాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన లో నాలుగు రోజుల పాటు పర్యటించి సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని పెట్టుబడిదారులను కూడా ఆకర్షించే విధంగా ప్రపంచ ఆర్ధిక సమావేశంలో కేటీఆర్ వ్యవహరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: