ఈ రోజు ఆదివారం కదండే టీబీలో మా జిల్లావోడు రాంగోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా సూత్తన్నా అండి. అందులో ఓ పాట లో సెంద్ర బాబు పాత్రలో ఉన్నోడు అల్ల అబ్బాయిని ఊరుకోబెడుతూ బాగ్రౌండ్లో ఓ పాట ఏసాడండి అయ్యబాబోయ్ ఇరగదీసాసిందని అటెల్లివోడు... ఇటెల్లివోడు అందరిని పిల్సి కూకోబెట్టాను. ఎరా ఎలా ఉంది రా ఈ పాట అంటూ అల్లనడిగితే ఇరగదీసేసింది అని సెప్పడంతో నాకు తెగ ఆనందం ఎసెసిందండి. మా సినబాబు గారి జీవితాన్ని ఒక్క పాటలో సూపెట్టేసిన మా వర్మ గొప్పతనం వాళ్లందరికీ సెప్పి తెగ సంతోషపడిపోయాను. 

 

ఇంతలో ఎవడో టీబీలో సినిమా మార్చేసి వార్తలు ఎట్టాడు. ఆ వార్తల్లో సెంద్రబాబు పార్టీ వొళ్ళు జగన్ పార్టీలోకి ఎల్లిపోతున్నారని బేకింగ్ బేకింగ్ అంటూ తెగ సూపిత్తాన్నాడు. నిజంగా ఆళ్ళు వెళ్ళిపోతే జగన్ అనుకున్నది సేసేత్తాడు. పోనీ అలా కాదు ఆళ్ళు మా సెంద్రబాబు ఏడుపు మొఖం సూసి పార్టీలోనే ఉన్నారనుకోండి జగన్ ఏమైనా తింగరోడా ? ఏంటనే ఆ శాసనమండలిని రద్దు సేసెయ్యాడేంటి ? నేను ఇదే ఇసయం మా పెండ్స్ కి సెప్తుంటే అవునురా ఒకేలా రద్దు సేసేత్తే సినబాబు పరిస్థితి ఏంట్రా అంటూ అడిగాడు. ఎరా సినబాబు కి ఈ పదవి ఒక లెక్కా ఆయన పార్టీ జాతీయ కార్యదర్షి పదవి ఉంది కదేహే అన్నాను. 

 

ఇంతలోనే ఇంకో సేనాలెట్టాడు మా వోడు. అందులో మండలి రద్దు సేత్తే నా పరిస్థితి ఏంటి అంటూ ఆళ్ల నాన దగ్గర సినబాబు ఒకటే ఏడుపు లంకించుకున్నాడని సూపిత్తన్నారు. పాపం ఆళ్ల నాన్నే ఏమి సేయ్యలో తెలియక ఇంట్లోకి ఎల్లి ఏడుపు లంకించుకుని బయటకొచ్చి ముసి ముసి నవ్వులు నవ్వుతూ.... నేను ఉన్నాను కదా మీకు ఏమి కాదు అని సెప్పినా ఒక్కడి మొకంలోనూ సిరు నవ్వే లేదు. అయ్యో పాపం అనుకునే లోపు మా పెండు ఇంకొకడు ఎరా ఎమ్యెల్చి పోతే ఏంట్రా మందలగిరి ఉంది కదరా ..!

 

అక్కడ కొంప కట్టుకుని బలంగా కాంక్రీట్ తో పునాదులేసుకుంటే సరిపోయేదానికి ఎందుకురా బాబు ఓ ఏడుపు లంకించుకుంటున్నాడు సినబాబు అంటూ జాలి సూపిత్తాన్నాడు. పాపం ఆ పసివాడు నాన్నారు నా పదవి పోతుందా అని అమాయకంగా అడుగుతున్నది టీబీలో సూపిత్తుంటే నా గుండె తరిక్కిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: