కొత్త మంది అదృష్టం బావుంటే ఎంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా కూడా ఏం కాదంట‌. భూమ్మీద నూక‌లుంటే ఎలాంటి ప్ర‌మాదం నుంచైనా త‌ప్పించుకుంటార‌ని పెద్ద‌లు ఊరికే అన‌రు మ‌రి. ఇక ర‌ష్యాలో ఓ అమ్మాయికి ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. అది ఆమె అదృష్ట‌మ‌నుకోవాలో లేక ఆమెకి మ‌రోజ‌న్మ అనుకోవాలో చూసిన జ‌నాల‌కి అర్ధం కావ‌డం లేదు. ఇంకొంత మందికైతే ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా తీవ్రంగా గాయాల‌పాల‌వుతారు.

 


ఒక్కోసారి శ‌ని వాడినెత్తి మీద తాండ‌వం ఆడితే ఏమీలేడు అన్న‌ట్లు  చనిపోవడం కూడా జరుగుతుంది. ఇందులో మొదటి తరహాకి చెందిన ఘటన రష్యాలో జరిగింది. సైబీరియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ 9వ అంతస్తు నుంచి పడిపోయింది. అయినా కూడా ఆమెకు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండానే .. లేచి నిలబడ‌డ‌మే కాకుండా తాపీగా తిరిగి పైకి నడుచుకుంటూ వెళ్లింది. బిల్డింగ్ పై నుంచి పడిపోయేటప్పుడు .. చెట్లు కానీ.. కరెంటు వైర్లు కానీ .. భవనానికి సంబంధించిన కిటికీల తలుపులు .. ఇలా ఏవీ కూడా ఆమెకు అడ్డం రాలేదు. దీంతో సరిగ్గా ఆమె స‌రాస‌రి వ‌చ్చి నేల మీద పడిపోయింది.

 


పడడం.. పడడమే డైరెక్ట్‌గా  మంచు కుప్ప మీద పడింది. అంత ఎత్తు నుంచి కింద పడినా.. చిన్న దెబ్బ కూడా కాలేదు. సరిగ్గా ఒక్క నిముషానికి తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంతకీ ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కిందకు దూకిందా అనే అనుమానంతో అందరూ ఆమెను ఆరా తీయ‌గా లేదు ప్రమాదవశాత్తూ అమె క‌లుజారి అక్క‌డి నుంచి పడిపోయిందా .. అసలు ఏం జరిగిందనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

 


ఇక ఇలాంటి విచిత్ర‌మ‌యిన ఘ‌ట‌న‌లు ఒక్కోసారి జ‌రుగుతాయి. అప్పుడు కొంత మంది దేవుడి లీల‌లు అంటారు. లేదంటే అంత పైనుంచి ప‌డిపోయినా చీమంత కూడా దెబ్బ‌లు త‌గ‌ల‌క‌పోవ‌డ‌మేంట‌ని అంద‌రూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఎంతో కొంతైనా దెబ్బ‌లు త‌గ‌లాలి. లేదా క‌నీసం అంత ఎత్తు మీద నుంచి ప‌డ‌డం కాబ‌ట్టి క‌నీసం షాక్ కి అయినా గురికావాలి. మ‌రి ఏదీ లేకుండా తాయితీయిగా లేచి నిల‌బ‌డ‌డ‌మేకాకుండా ఏకంగా పైకి తిరిగి న‌డుచుకుంటూ వెళ్ళిందంటే మాములు విష‌యం కాదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: