మండలి రద్దు.. అవును.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చిన్న పిల్లోడు కూడా అంటున్నాడు.. మండలితో ఉపయోగం ఏంటి అని.. మండలి వల్ల.. రాష్ట్ర అభివృద్ధి పాడవుతుంది కానీ ఇంకా ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. మండలిని అస్త్రంగా ఉపయోగిస్తాయి ప్రతిపక్షాలు.. 

           

అంతే తప్ప.. మండలి వల్ల ఉపయోగం ఉండదు అని అంటున్నారు. వాళ్ళు అనడమే కాదు.. సీఎం జగన్ కూడా అదే అన్నారు.. మండలి అవసరం ఏముంది అని.. ఒక్క సీఎం జగన్ ఏ కాదు.. అప్పట్లో అంటే.. 1985లో కూడా ఎన్టీఆర్ మండలిని రద్దు చేశాడు. అప్పట్లో కూడా ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఈ మండలి అనే అస్త్రంతో అన్నింటిని ఆపేయాలని చూశారు.. 

            

అప్పుడు ఎన్టీఆర్ కు చిరాకు వచ్చి ఈ మండలిని రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా శాసనమండలిని రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలో హయాంలో ఉన్న కూడా కేవలం ఎన్టీఆర్ రద్దు చేశారు అని.. మండలి వల్ల ఉపయోగం లేదు అని రద్దు చేశాడు. 

 

అయితే ఇప్పుడు.. నరేంద్ర మోడీ బీజేపీ లేదా ఇత‌రుల మాట విని జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వెళ‌తాడా లేదా ర‌ద్దుకు ఓకే చెపుతాడా అనేది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. అయితే ఈ మధ్యే చంద్రబాబు దత్తపుత్రుడు అయినా పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.. ఆ పొత్తుతో ఏమైనా మోడీ నిర్ణయం మారుతుందా? లేకపోతే రద్దుకు ఒకే చెప్తారా? అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: