జగన్ సర్కార్ శాసనమండలికి మంగళం పాడింది. శాసన మండలి నిర్ణయం తో జగన్  సర్కారు మరో కొత్త చరిత్ర సృష్టించింది అనే చెప్పాలి. వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుకు జగన్ సర్కార్ కు శాసనమండలిలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవడం... శాసన మండలి ఎక్కువ మెజారిటీ ఉన్న టిడిపి ఎమ్మెల్యేలందరూ వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయం తీసుకోవడం... ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ కూడా అదే నిర్ణయం వెల్లడించడంతో జగన్ సర్కార్ శాసనమండలి తీరుపై తీవ్ర ఆగ్రహంతో శాసన మండలి రద్దు చేయాలని నిర్ణయించారు. 

 

 

 అయితే శాసన మండలి రద్దు అయ్యే సమయానికి... ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని ఆ తర్వాత వైసీపీకి బలం చేకూరుతుందని తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం ప్రస్తుత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా శాసన మండలి రద్దుకే నిర్ణయించింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ రద్దు చేసిన శాసన మండలని  రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ పునరుద్ధరణ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమకు ఎన్నో  మాత్రం రాజకీయ ప్రయోజనాల ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం గా శాసనమండలిని రద్దు చేసారు . వికేంద్రీకరణ బిల్లు ఆచరణలో పెడితే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని భావించిన జగన్ సర్కార్ వికేంద్రీకరణకు ఇబ్బందులకు గురిచేస్తున్న శాసనమండలిని రద్దు చేశారు. 

 

 

 అయితే ఇప్పటికే ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీలు  ఇచ్చినప్పటికీ.. శాసన మండలి ద్వారా వైసీపీ  పార్టీకి ఎన్నో  రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సంకల్పించింది జగన్ సర్కార్. అయితే ప్రస్తుతం శాసనమండలిలో బలాన్ని కలిగి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసనమండలి రద్దయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. అయితే శాసన మండలి రద్దు అయ్యాక మండలిలో ఎమ్మెల్సీలు రాజకీయ నిరుద్యోగులు అయితే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: