శాసన మండలి రద్దు విషయంలో సోమవారం జరిగిన అసెంబ్లీ లో తీవ్ర స్థాయిలో చర్చలు జరిపారు. వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంగా ఆమోదం పొందిన బిల్లులను శాసనమండలిలో పెద్దలు మేధావులు సలహాలు ఇవ్వాలి గాని రాష్ట్ర భవిష్యత్తును అడ్డుకునే విధంగా శాసనమండలిని ఆధారం చేసుకుని రాజకీయం చేయడం దారుణమని శాసనమండలిని రద్దు చేయడం కరెక్ట్ నిర్ణయమని సమర్థించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు బిల్లు విషయంలో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వం తీసుకున్న శాసన మండలి రద్దు బిల్లు విషయంలో సమర్థిస్తున్నట్లు రాపాక వర ప్రసాద్ ప్రకటించారు.

 

అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ...వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు అసెంబ్లీలోనే అన్ని రకాల నిపుణులు ఉన్నారని, ఇంకా వేరే సభ అవసరం లేదని ఆయన అన్నారు. 154 మంది సభ్యులు తీర్మానం చేసి పంపితే మండలి తిరస్కరిస్తుందా అని రాపాక వరప్రసాద్ ప్రశ్నించారు. బలహీనవర్గాలకు ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం బిల్లును తెస్తే అసెంబ్లీలో చంద్రబాబు సమర్దించారని, కాని మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యతిరేకించారని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా ఉండే మాల,మాదగలను చంద్రబాబు విడదీశారని దారుణమైన రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

 

నిరసన చెప్పేవారిపై గుర్రాలతో తొక్కించారని అన్నారు. విడదీసి పాలించడం చంద్రబాబు లక్షణమని ఆయన నైజమని విమర్శించారు. మండలి చైర్మన్ షరీప్ పెద్దమనిషి అని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రభావితం చేశారని శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో టిడిపిని తప్పుబట్టారు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. దీంతో అసెంబ్లీలో మరొకసారి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలకు జనసేన ఎమ్మెల్యే జై కొట్టడంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: