శాసన మండలి రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ఆమోదించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి జగన్ వ్యవహారశైలిపై సీరియస్ అయ్యారు. 1983 లో ఎన్టీ రామారావు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకున్నారని అందుకే శాసనమండలిని రద్దు చేశారని కానీ మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జగన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. శాసనమండలిలో రూల్స్ 71 తీసుకొస్తే మంత్రులు శాసన మండలి లో దారుణంగా వ్యవహరించారని కానీ మా ఎమ్మెల్సీలు ఎక్కడా బెదర లేదని బాగా పని చేశారని రాష్ట్రాన్ని కాపాడటం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

 

రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్ కోసం మూడు రాజధానులు వద్దు అని ఒక రాజధాని కావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కంకణం కట్టుకున్నారని రెండు రోజులపాటు వైసిపి పార్టీ నేతల ప్రలోభాలకు లొంగకుండా ఉన్నారని పేర్కొన్నారు. వైసిపి పార్టీ నేతలు ఎంత కవ్వించినా టీడీపీ ఎమ్మెల్సీలు స్పందించలేదని వారి పనితీరు అద్భుతమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే తరుణంలో ఈనాడు పేపర్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ...ఆయన పుట్టకముందే తెలుగుదేశం పార్టీ పెట్టకముందే ఈనాడు పేపర్ వుందని తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈనాడు పేపర్ ఎంతో ముఖ్యమని ...ఈనాడుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

 

ఇదే తరుణంలో ఆంధ్రజ్యోతిపై మరియు కొన్ని కారణాల పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డదారుల్లో జగన్ కుటుంబం డబ్బులు సంపాదించడం జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ లొంగ లేదు కాబట్టే అధికార పార్టీ డబ్బులకు ఎక్కడా కూడా స్పందించలేదు కాబట్టే శాసన మండలి రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు నీతి నిజాయితీపరులు అని పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేశారని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: