ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో శాసన మండలి రద్దు నిర్ణయం పై వైయస్ జగన్ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు రాజకీయాల్లో అనుసరించే ద్వంద వైఖరి పై తీవ్రస్థాయిలో వీడియోలతో సహా బయటపెట్టడంతో సభలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెగ నవ్వుకున్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడంలో చంద్రబాబు కి మించిన వారు మరొకరు లేరన్నట్టుగా జగన్ తన వ్యాఖ్యలతో చంద్రబాబు రాజకీయ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా శాసన మండలి రద్దు గురించి మాట్లాడుతూ...ఏడాది కాలంలో తమ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం మండలిలో ఉన్నప్పటికీ తాము ప్రజల కోసం, ప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

 

ఇప్పుడు తాము ఎమ్మెల్సీలను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నామని, టిడిపి పత్రికలు దారుణంగా రాస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటే ఈ మీడియా ఏమైనా రాసిందా? 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా టిడిపిలో చేర్చుకుని, నలుగురికి మంత్రి పదవులు ఇస్తే ఈ మీడియా ఒక్క ముక్క రాయలేదు. పైగా చంద్రబాబు రాజనీతి, ఆయనను చూసి పార్టీ మారుతున్నారని దిక్కుమాలిన రాతలు రాశాయి. ఓటుకు కోట్లు పెట్టి తెలంగాణలో దొరికితే ఈనాడు, చంద్రజ్యోతి, టివి 5 వంటివి ఒక్క రోజు అయినా రాశాయా అని ఆయన ప్రశ్నించారు.

 

ఇలాంటి రాజకీయాలు తాము చేయాలని అనుకోవడం లేదని..చంద్రబాబు రాజకీయాలు చేసి ఉంటే ఈపాటికి టిడిపి ప్రతిపక్ష పార్టీలో ఉండేది కాదని రాజకీయాల్లో మార్పు రావాలని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయినా గాని ఎల్లో మీడియా నాపై అనవసరమైన రాతలు రాస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలకు ఐదు కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు చంద్రబాబు కి మద్దతు తెలిపే పత్రికలు మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి మూడు రోజుల సమయం కూడా ఇవ్వకపోతే జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎవరి సలహాలు తీసుకోకుండా శాసనసభ రద్దు చేశారు అనే బురద నాపై వేస్తారని..జగన్ ఎల్లో మీడియా పై అసెంబ్లీ లో అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: