ఆపరేషన్ ఆకర్ష్ అంటూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా ఒకటే ఊదరగొట్టింది.  ఎల్లోమీడియాలో గడచిన మూడు రోజులుగా జగన్ పై బురద చల్లుతు వచ్చిన కథనాలు చూస్తే ఇపుడు వాటికి నోరు లేవటం లేదు. టిడిపి నుండి ఎంఎల్సీలను లాగేసుకుంటున్నట్లు రెండు పత్రికల్లోను ఇష్టం వచ్చినట్లు రాసేశారు. తెలుగుదేశంపార్టీకి చెందిన ప్రతి ఎంఎల్సీకి సుమారు రూ. 5 నుండి రూ. 10 కోట్ల వరకూ బేరాలు పెడుతున్నట్లు చెప్పారు.

 

టిడిపి ఎంఎల్సీలను ఆకర్షించటమే టార్గెట్ గా సీనియర్ మంత్రి ఇంట్లో బేరాలు జరిగినట్లు చెప్పారు.  దాదాపు 12 మంది తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీలను వైసిపిలోకి లాగేసుకునే ఉద్దేశ్యంతోనే  వ్యూహాలు పన్నినట్లు జగన్ పై బురద చల్లేశారు. ఒకవైపు ఏ పార్టీ ఎంఎల్సీలను కూడా  వైసిపిలో చేర్చుకునే సమస్యే లేదని జగన్ స్పష్పంగా చెబుతున్నా ఎల్లోమీడియా ఏమాత్రం పట్టించుకోలేదు.

 

బురద చల్లటమే ధ్యేయంగా జగన్ చెప్పిన విషయాలను పక్కనపడేసి తాము అనుకున్నదే ఎల్లోమీడియా కథనాల రూపంలో  ఆచరణలోకి తెచ్చాయి.  తీరా చూస్తే ఇపుడు శాసనమండలి రద్దయిపోయింది. నిజంగానే మండలిని రద్దు చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు.  టిడిపి ఎంఎల్సీలు పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నారని మంత్రులు, నేతలు చెబితే జగన్ వాళ్ళపై సీరియస్ అయ్యాడు. తనను కూడా చంద్రబాబు స్ధాయికి దిగజార్చేయద్దని సీరియస్ గా వార్నింగే ఇచ్చాడు.

 

ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఆరోపణలు చేయటం ఎల్లోమీడియా అచ్చేయటం. లేకపోతే ఎల్లోమీడియా అచ్చేయగానే చంద్రబాబు ఆరోపణలు చేయటం అందరూ చూసిందే. మొత్తానికి చంద్రబాబు, ఎల్లోమీడియా ఎన్ని ఆరోపణలు చేసినా ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా జగన్ మాత్రం మండలిని రద్దు చేస్తు తీర్మానం చేయించేశాడు.

 

అంటే ఇప్పటి వరకూ చంద్రబాబు, ఎల్లోమీడియా చేసిన ఆరోపణలన్నీ అబద్దాలని తేలిపోయింది. అందుకనే మండలి రద్దుకు  క్యాబినెట్  తీర్మానం చేయగానే చంద్రబాబు, ఎల్లోమీడియా నోళ్ళు పడిపోయాయి. అప్పటి వరకూ తాము జగన్ పై బురద చల్లటంపై అసలు ప్రస్తావన కూడా తేవటం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: