శాసనమండలి రద్దు తీర్మానం విషయంలో  అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సమయంలో వైసిపికి చెందిన 18 మంది ఎంఎల్ఏలు గైర్హాజరయ్యారు. అంటే అధికారపార్టీకి ఉన్న 151 మంది ఎంఎల్ఏల్లో ఓటింగ్ లో పాల్గొన్నది 133 మంది మాత్రమే. ఎప్పుడైతే ఓటింగ్ లో కొందరు వైసిపి ఎంఎల్ఏలు హాజరుకాలేదని తెలిసిందే వెంటనే టిడిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వైసిపిలోని ఎంఎల్ఏల్లోనే అందరికీ ఇష్టం లేదని టిడిపి ఎంఎల్సీ దీపక్ రెడ్డి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

 

జగన్ నిర్ణయంతో విభేదించిన కారణంగానే ఓటింగ్ కు గైర్హాజరయ్యారని తీర్మానించేశారు. దీపక్ మాటలనే మరికొందరు టిడిపి నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. దానికి సహజంగానే ఎల్లోమీడియా విపరీతమైన ప్రచారం చేస్తోంది. సరే టిడిపి నేతల ఆరోపణలను పక్కనపెడదాం. మరి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు ఓటింగ్ లో ఎందుకు 18 మంది హాజరుకాలేదు ?  ఎందుకు హాజరుకాలేదంటే తమ వ్యక్తిగత పనుల నిమ్మితం వెళ్ళటం వల్లే  18 మంది ఓటింగ్ లో పాల్గొనలేదని సమాచారం.

 

ఉదయం అసెంబ్లీ సమావేశం మొదలుకాగానే మండలి రద్దు తీర్మానాన్ని జగన్ ప్రతిపాదించారు. దాని బలపరుస్తు చాలామంది మాట్లాడారు. అందరూ మాట్లాడి చివరలో ఓటింగ్ జరగాలంటే చాలా గంటలే పడుతుందని అందరికీ తెలిసిందే. అందుకనే వ్యక్తిగతంగా పనులున్న వాళ్ళు జగన్ తో అదే విషయాన్ని చెప్పారట. అందుకనే  బిల్లుకు మద్దతుగా  మాట్లాడే సభ్యులతో  ముందు మాట్లాడించారట. మాట్లాడినవాళ్ళు కూడా మండలి రద్దుకు సంపూర్ణ మద్దతు పలుకుతూ మాట్లాడారు.

 

వాస్తవం ఇలాగుంటే టిడిపి మాత్రం జగన్ ప్రతిపాదనకు వైసిపిలోనే సంపూర్ణ మద్దతు లేదని ఆరోపణలు చేస్తు సంతృప్తి పడుతున్నారు. నిజానికి వైసిపి దెబ్బకు భయపడే చంద్రబాబునాయుడు, టిడిపి ఎంఎల్ఏలు సభకు గైర్హాజరయ్యారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అసలు సమావేశాలకే హాజరుకాని టిడిపి వాళ్ళు వైసిపి ఎంఎల్ఏల గైర్హాజరుగురించి ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: