ఏమో ఈ పెద్దవాళ్ల సామెతలు చిత్రంగా అనిపిస్తూనే నమ్మాల వద్ద అనేలా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. 'దోస్త్ మేరా దోస్త్  తూహె మేరీ జాన్ లాంటి పాటలతో మోగిపోతుంటే. కేసీయార్‌తో జగన్ దోస్తాన్‌ను రేవంతన్న శంకిస్తున్నాడు.

 

 

ఇలా ఎందుకని ఆడిపోసుకుంటున్నాడంటే ఇప్పుడు ఏపీలో జరిగిన మండలిని రద్దు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ హస్తం ఉన్నదని, అతనితో స్నేహం చేయడం వల్లే  ఏపీ సీఎం జగన్‌ ఇటువంటి విధ్వంసానికి పూనుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేసారు. ఇకపోతే కేసీయార్ గురించి యావత్ ప్రజానీకానికి తెలుసునని, కేసీఆర్‌ను నమ్మినవారు బాగుపడినట్లు ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో లేదని పేర్కొన్నారు..

 

 

ఒక సారి రాజకీయ భవిష్యత్తును తరచి చూసుకుంటే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి 2004లో.. చంద్రబాబుకి 2009లో కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారు. ఇదే కాకుండా 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీతో ఇలా ఉంటా అని సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ లను, నమ్మించి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు రాష్ట్రం వేరుపడిన తర్వాత కేసీఆర్‌, జగన్‌తో జట్టు కట్టి ఆయనకు ఇచ్చే సలహాల వల్ల, ఏపీలో రాజకీయ అశాంతి చెలరేగుతుందని, విమర్శించారు.

 

 

ఇకపోతే ఒక స్దాయిలోకి వచ్చాక ఏదైనా సలహాలు, సూచనలు స్వీకరించాలనుకుంటే ముఖ్యంగా, సలహాలు ఇచ్చే వ్యక్తి యొక్క నేపథ్యం, గుణం దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి. అంతేకానీ కేసీఆర్‌ లాంటి వారి సలహాలను జగన్‌ పాటిస్తే మాత్రం ఆయనకు భవిష్యత్‌లో చీకటే తప్ప వెలుగు ఉండదు’’ అని ఢిల్లీలో రేవంత్‌ రెడ్ది  మీడియాతో  పై విధంగా వ్యాఖ్యానించారు.

 

 

ఇక వీరి స్నేహాన్ని ఇంతలా అనుమానించడం దేనికని ఆడిగితే..  పక్కరాష్ట్రంలో అస్థిర పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండదనే ఆలోచనతోనే జగన్‌కు కేసీఆర్‌ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు.. ఇక ఈ విషయంలో ఎవరిని పట్టించుకోకుండా కేసీఆర్‌తో ఇదే రకంగా స్నేహం కొనసాగిస్తే.. జగన్‌తో పాటు ఏపీ భవిష్యత్‌ అంధకారమేనని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: