ఒక విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ సత్తా ఏంటో తేలిపోయింది. కాబట్టి కనీసం రెండో విషయంలో అయినా సత్తా చూపుతారా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.  రాజధానిగా అమరావతిని అంగుళం కూడా కదల్చనిచ్చేది లేదంటూ భీకర ప్రతిజ్ఞలు చేసి ఢిల్లీకి వెళ్ళారు. తీరా అక్కడేమైందో ఏమో ప్లేటు ఫిరాయించేశారు. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ తానే కొత్తగా కనిపెట్టినట్లు చెప్పి నవ్వులపాయ్యారు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి నుండి  విజయవాడకు లాంగ్ మార్చ్ నిర్వహించబోతున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేసి బోర్లా పడ్డారు. పవన్ చేసిన కార్యక్రమాన్ని  బిజెపి నేతలు రద్దు చేయించారు.  దాంతో కమలం పార్టీ ముందు తన సత్తా ఏంటో పవన్ కు బాగానే తెలిసిపోయింది. సరే ఏదోలా నెట్టుకొచ్చేద్దామని అనుకుంటున్నాడా అంటే అదీ లేదు.

 

తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసిన శాసనమండలి రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నిజానికి మండలి గురించి పవన్ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రెండు సీట్లున్న మిత్రపక్షం బిజెపినే ఏమీ మాట్లాడనపుడు పవన్ కు మాత్రం ఏమిటవసరం ?  పైగా మండలి రద్దుకు వ్యతిరేకంగా పోరాడుతానంటూ మళ్ళీ ఇంకో ప్రకటనొకటి. అంటే పవన్ లో సమస్యేమిటంటే తానేం మాట్లాడుతాడో తనకే తెలీదు. కాకపోతే మీడియానే పవన్ ను పెద్ద నేతగా మార్చేసింది.

 

సరే మండిలి రద్దుకు  అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీకి కూడా పంపేసింది. మరిపుడు పవన్ ఏమి చేయబోతున్నారు. ఎలాగూ మరో రహస్య మిత్రుడు చంద్రబాబునాయుడు కూడా మండలి రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా ? మరి చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ ప్రయత్నాలను కేంద్రం స్ధాయిలో పవన్ అడ్డుకుంటారా ? మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రంలో  పవన్  అడ్డుకుని జగన్ కు ఏపి జనాలకు తన స్ధాయేంటో చూపించచ్చు కదా.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: