పాపం లోకేష్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన మీద సీమాతి వర్షం కురుస్తోంది. ఏ నలుగురు మాట్లాడుకున్నా లోకేష్ గురించి చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయ దురదృష్టవంతుడుగా పోల్చుతూ జనాలు మాట్లాడుకుంటున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఘోరంగా ఓటమి చెంది  ఇప్పటికే అవమాన భారంతో జనాల్లో తిరగలేక పోతున్నాడు. అయినా ఆయనకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి ఉండడంతో ఏదో ఒక సమస్య పై పోరాడుతున్నట్టు హడావుడి చేస్తూ కనిపించారు. కానీ ఇప్పుడు ఏకంగా శాసనమండలి రద్దు అయ్యే అవకాశం ఏర్పడడంతో లోకేష్ రాజకీయ జీవితం డైలమాలో పడింది. 


ఈ ఏడాది రాబోయే ఉగాది ఆయనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చే విధంగా కనిపిస్తోంది. అయితే 2017 లో వచ్చిన ఉగాది లోకేష్ రాజకీయ జీవితాన్ని మార్చేసింది. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు శాఖలకు మంత్రిగా కాబోయే పార్టీ రథసారథి గా ఆయన తన హవాను చూపించారు. అప్పటికీ టిడిపి ప్రభుత్వంలో లోకేష్  దర్శనం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులంతా క్యూలు కడుతూ ఉండేవారు. ఆయన చెబితే చాలు ఎంత పెద్ద పని అయినా చిటికెలో అయిపోయేది. ఆయనకు  పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతగా ప్రాధాన్యం ఉండేది. అయితే రెండేళ్లు తిరిగే సరికి లోకేష్ రాజకీయ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.


 ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా త్వరలోనే పోయేలా ఉండడంతో ఆయన మాజీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇకపై ఆయనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా తప్ప ఏ విధమైన ప్రోటోకాల్ ఉండేలా లేదు. ఇంకా ఎన్నికలకు చూస్తే నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటికే పార్టీలో కీలకమైన నాయకులంతా భవిష్యత్తు మీద బెంగతో వివిధ పార్టీల్లో చేరిపోయారు. ఇంకా వైసీపీ ప్రభుత్వానికి నాలుగు సంవచ్చారాల పైనే అధికారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ నాలుగున్నరేళ్లలో లోకేష్ ఏ విధంగా ముందుకు వెళతాడు..? పార్టీ నాయకుల్లో ఏ విధంగా భరోసా కల్పించే నాయకుడు గా తనను తాను నిరూపించుకుంటాడు అనేది తేలాల్సి ఉంది. బహుశా ఈ నాలుగున్నరేళ్లలో టిడిపి బాగా బలహీన పడే అవకాశం ఉండటంతో పాటు చంద్రబాబు వయసు రీత్యా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం వస్తుండటంతో లోకేష్ లో  మరింత ఆందోళన పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: