సొంత పార్టీ వారైనా... ప్రత్యర్థి పార్టీ వారైనా క్రమశిక్షణ, అవినీతి వ్యవహారాల్లో జగన్ ట్రీట్మెంట్ ఒకేలా ఉంటోంది. తన పరిపాలనలో అవినీతి, అక్రమాలకు చోటే ఉండకూడదని భావిస్తున్న జగన్ ఈ విషయంలో సొంత పార్టీ నేతలను సైతం వదిలి పెట్టడం లేదు. ముందు మనం నీతి నిజాయితీలతో ఉంటే, రాజకీయ ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంతో పాటు.. ప్రజల్లోనూ పార్టీపై నమ్మకం పెరుగుతుందని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న చర్యలు ప్రతిపక్ష టీడీపీ ని ఇబ్బంది పెట్టేవిగా కనిపిస్తున్నా క్రమక్రమంగా ఎఫెక్ట్ సొంత పార్టీ నేతల పైన పడుతోంది. జగన్ తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్ష టిడిపి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎవరి ఊహకు అందనంత విధంగా జగన్ తన నిర్ణయాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నాడు. 


అదే సమయంలో పార్టీ నియమ, నిబంధనలు తప్పుతూ క్రమశిక్షణ తప్పిన వారిని అంతే స్పీడుగా పక్కన పెట్టేందుకు వెనకాడడం లేదు. టిడిపి అధికారంలో ఉండగా వైసిపి నాయకులపైన అనేక అవినీతి విమర్శలు, ఆరోపణలు చేసింది. ఇప్పుడు వైసిపి అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పట్లో టిడిపి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించుకోవలసిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉంది. అందుకే జగన్ పై టిడిపి నాయకులు చేసిన ఆరోపణలు ఏవీ నిజం కాదు అని నిరూపించుకునేందుకు తాపత్రయపడుతున్నారు.


 ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తారని ఎవరు ఊహించలేదు. టిడిపి వైసిపి నాయకులు కూడా ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయినా వైసీపీ కి చెందిన ఎమ్యెల్సీ లు ఎవరూ జగన్ పై ఎక్కడా వ్యతిరేకత చూపించడం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో నాయకులు జోక్యం లేకుండా... ప్రతి పని పారదర్శకంగా జరిగేలా, అధికారుల్లో జవాబుదారీతనం పెరిగేలా జగన్ కఠిన చర్యలు తీసుకుఅంటున్నారు. దాని ఫలితం ఏపీలో బాగా కనిపిస్తోంది. 


సొంత పార్టీ నేతలు సైతం అవినీతి వ్యవహారాలు చేయాల్సిందిగా అధికారుల దగ్గరకు వచ్చినా  నిర్ధాక్షణ్యంగా తిరస్కరించాలి అంటూ జగన్ ఇప్పటికే  అధికారులకు సూచించారు. జగన్ చర్యలతో జనాల్లో ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. పార్టీ శ్రేణులు కూడా జగన్ చర్యలను అర్థం చేసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: