ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి ముఖ్యమంత్రి జగన్ క్రేజ్ పెరిగిపోతుంది. ఒక పక్క రాష్ట్రంలోనూ మరో పక్క దేశంలో అంతర్జాతీయ స్థాయిలో జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల నోబెల్ గ్రహీత ఒకరు జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన అమ్మఒడి పథకం గురించి మాట్లాడుతూ అద్భుతమైన పథకాన్ని ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ అందిస్తున్నారని మంచి నాయకుడు అని ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదని పొగడటం జరిగింది. ఇదే తరుణంలో దేశంలో నాలుగవ మంచి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిగా ఇటీవల జగన్ కి ర్యాంకు రావడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏపీ ప్రభుత్వాన్ని ప్రపంచ స్థాయి లోనే హాట్ టాపిక్ గా నిలుపుతున్నాయి.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులతో అలాగే కలెక్టర్లతో ఎస్పీలతో సచివాలయంలో సమీక్ష సమావేశంలో మాట్లాడిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాలేజ్ అమ్మాయిలకు అబ్బాయిలకు అనగా ఐటిఐ మరియు డిగ్రీ అదేవిధంగా పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు జగన్ అన్న దీవెన పథకం కింద నగదు అందించడానికి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసినదే. 'జగనన్న వసతి దీవెన పథకం' కింద ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి 10,000 రూపాయల నగదు ప్రభుత్వం జమ చేయనుంది.

 

పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లో రెండు విడతలుగా డబ్బులు జమ చేయనుంది. ఫిబ్రవరి 20వ తారీకు నుండి ఈ పథకం అమలులోకి రానుంది అని సమాచారం. ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా జగన్ ఈ విధంగా ఇవ్వటంతో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజ్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఐ లవ్ యు జగనన్న అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది పేద విద్యార్థుల అయితే మా తల్లిదండ్రుల పై ఉన్న భారాన్ని కొంత తగ్గించారు జగనన్న అంటూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: