ఢిల్లీ రాజకీయాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శాసనమండలి రద్దు అవటానికి కనీసం మూడేళ్ళు పడుతుందని చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు అండ్ కో ఒకటే ఊదర గొడుతున్నారు. ఇలాంటి వాళ్ళకందరికీ బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు పెద్ద షాకే ఇచ్చారు. శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  

 

శాసనమండలి రద్దు గురించి జీవిఎల్ మాట్లాడుతూ అసెంబ్లీ పంపిన శాసనమండలి రద్దు విషయంలో కేంద్రప్రభుత్వం  రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తుందని చెప్పటంతో ఇపుడు  చంద్రబాబు అండ్ కో కు టెన్షన్ మొదలైంది. పార్లమెంటరీ కమిటి సూచనల ప్రకారమే కేంద్రం నడుచుకుంటుంది కానీ ఏ ఒక్కరి కోసమో కాదని స్పష్టంగా చెప్పేశారు. పైగా ఉద్దేశ్యపూర్వకంగా మండలి రద్దు తీర్మానం ఆమోదంపై ఎటువంటి జాప్యం చేయాల్సిన అవసరం కూడా కేంద్రానికి లేదని తేల్చి చెప్పేశారు.

 

జీవిఎల్ చేసిన వ్యాఖ్యలన్నీ చంద్రబాబును ఉద్దేశించి చేసినట్లుగానే అనిపిస్తోంది.  ఎందుకంటే మండలి రద్దును కేంద్రం అంత తొందరగా తేల్చదని కనీసం మూడేళ్ళు పడుతుందని చంద్రబాబు అండ్ కో ఆశాభావంతో ఉన్నారు.  అంటే అప్పటికి కొడుకు లోకేష్ తో పాటు చాలామంది పదవీ కాలం అయిపోతుంది లేండి. ఇక్కడ కూడా కొడుకు క్షేమాన్ని చంద్రబాబు చూసుకుంటున్నట్లు అందరికీ అర్ధమైపోతోంది.

 

బహుశా ఢిల్లీలో తనకున్న నెట్ వర్క్ ను ఉపయోగించి లేదా గాడ్ ఫాదర్ దయతో  బిల్లు ఆమోదానికి అడ్డుపడటమో లేకపోతే  తాను చెబుతున్నట్లు డిలే చేయించటమే చేయవచ్చని అనుకున్నట్లున్నారు. కానీ  తాను ఊహించినదానికన్నా జగన్మోహన్ రెడ్డి చాలా స్పీడుగా ఉంటారని చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు. అదే సమయంలో  చంద్రబాబును కూడా ప్రధమశతృవుగా భావిస్తున్న బిజెపి అగ్రనేతలు బిల్లును వెంటనే పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

మండలి రద్దు గనుక ఉభయసభల్లో ఆమోదం పొందితే  చంద్రబాబు దాదాపు నెలమట్టమైపోయినట్లే. ఎందుకంటే ఒకేసారి 34 మంది మండలి సభ్యులు పదవులు కోల్పోతారు. తాను ఆడిన తొండాట చివరకు తాన మెడకే చుట్టుకుంటుందని ఊహించుండరు.  జగన్-చంద్రబాబు గొడవలను ప్రస్తుతానికి బిజెపి నాయకత్వం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైపోయింది. తెలుగుదేశంపార్టీ పూర్తిగా నేలమట్టమైపోతేనే బిజెపి యాక్టివేట్ అవ్వాలని యోచిస్తోంది. కాబట్టి ప్రస్తుతానికైతే చంద్రబాబు టార్గెట్ గానే బిజెపి పావులు కదుపుతోందన్నది వాస్తవం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: