చినబాబు అనవసరంగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీతో గోక్కుంటున్నారా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ  విషయం ఏమిటంటే తెలుగుదేశంపార్టీ తిరుగుబాటు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని ఉద్దేశించి లోకేష్  ట్విట్టర్లో  సంతలో గొర్రెలు అని కామెంట్ చేశాడు. సంతలో గొర్రెలంటే ఒకపార్టీ తరపున గెలిచి మరోపార్టీకి అమ్ముడుపోవటమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంటే చంద్రబాబునాయుడు కొన్నట్లన్నమాట.

 

నిజానికి  లోకేష్ తనని తాను పెద్ద మేధావిగా భావిస్తుంటాడు.  సంతలో గొర్రెలను కొన్నట్లు ఎంఎల్ఏలను కొనుగోలు చేసిన చరిత్ర తన తండ్రి నారా చంద్రబాబునాయుడుదే అని లోకేష్ మరచిపోయినట్లున్నాడు.  2014లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను గొర్రెలో లేకపోతే పశువుల్లాగానో కొన్నదే చంద్రబాబు అన్న విషయం అందరూ చూసిందే.

 

జగన్మోహన్ రెడ్డి గనుక నిజంగానే  గేట్లు ఎత్తుంటే టిడిపిలో ఓ నలుగురైదుగురు తప్ప మిగిలిన ఎంఎల్ఏలు ఎప్పుడో వైసిపిలో చేరిపోయుండే వాళ్ళనటంలో సందేహమే లేదు. ఇక లోకేష్ కామెంటుకు వంశీ గట్టి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు లేండి. ఎలాగూ వెటర్నరీ డాక్టరే కాబట్టి తనకు పశువులకు వైద్యం చేయటంతో పాటు కుక్కల్లాగ మొరుగుతున్న వాళ్ళకి కూడా వైద్యం చేయటం వచ్చన్నారు. వంశీ అన్నంత పనీ చేయగలడని ఇప్పటికే రుజువైంది.

 

ప్రత్యర్ధులపై నోటికొచ్చినట్లు మాట్లాడే టిడిపి నేతల్లో ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ కూడా ఒకడు.  అలాంటి రాజేంద్రప్రసాద్, వంశీలకు ఓసారి టివి చర్చా కార్యక్రమంలో గొడవైంది. అప్పుడు వంశీ తిట్టిన తిట్లకు, మాట్లాడిన మాటలకు రాజేంద్రప్రసాద్ కు ఏడుపొకటే తక్కువ. ప్రత్యర్ధులపై నోరేసుకుని పడిపోయే ప్రసాద్ కూడా వంశీ దెబ్బకు  నోరిప్పలేకపోయాడు. వంశీ దెబ్బకు అప్పటి నుండి ప్రసాద్ మళ్ళీ ఎక్కడా టివి చర్చల్లో కనబడటం లేదు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు.

 

రాజేంద్రప్రసాద్ నే నోరు మూయించిన వంశీకి లోకేష్ ఓ లెక్కేకాదన్న విషయం అందరికీ తెలిసిందే. వంశీతో పెట్టుకుంటే లోకేష్ కు కూడా అదే సన్మానం ఖాయం. అంటే వంశీతో చర్చలకు కూర్చునే సీన్ లోకేష్ కు లేదనుకోండి అది వేరే సంగతి.  ఏదేమైనా వంశీతో గోక్కుంటే  లోకేష్ కు నెత్తురు రావటం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: