చైనాలో వ్యాప్తి చెందిన  కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని  బెంబేలెత్తిస్తున్నది. ఇప్పటికీ చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్...  ఇప్పటికే వందకు పైగా ప్రాణాలను బలితీసుకుంది. దీంతో పాటు మిగతా దేశాలు కూడా కరోనా  వైరస్ తో  బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే  చాలా దేశాలు తమ దేశం నుంచి చైనాకు వెళ్లే విమాన సర్వీసులు  సహా వివిధ సర్వీసులను రద్దు చేశారు కూడా. ఇక చైనా నుంచి విమానంలో వస్తున్న వారిని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విమానం నుండి పంపుతున్నారు. ఇప్పటికే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న... కరోనా  వైరస్ తో ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. 

 

 

 ఈ క్రమంలో భారత దేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల  సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఎనిమిది వందల అరవై మంది కరోనా వైరస్ సోకిన అనుమానంతో పరిశీలనలో ఉంచారు అధికారులు. కాగా ఈ అనుమానితులు 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఈరోజు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఇప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందేమో  అని అనుమానంతో 19 మందిని రాష్ట్రంలోని  వివిధ ఆస్పత్రుల్లో చేర్పించగా... వారిలో 9 మంది డిశ్చార్జ్ అయ్యారు అంటూ కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే కే శైలజా వెల్లడించారు. 

 

 

 కరోనా  వైరస్ సోకిందని అనుమానించిన 16మంది నమూనాలని  పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగ ... పదిమందికి ఫలితం ప్రతికూలంగానే వచ్చినట్టు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇంకొంతమంది ఫలితాల కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. అయితే చైనా దేశం నుంచి వచ్చిన వారు చాలా జాగ్రత్తలు పాటించాలని.. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆరోగ్య అధికారులతో సంప్రదించాలి అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజా సూచించారు. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు... వైరస్ ముప్పును  ఎదుర్కోవడానికి.. ఇప్పటికే  కేరళ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేపట్టిందని అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: