ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ ను  ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే  దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ గాలులు వీస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ వైపు అన్ని రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లో సరైన నిధులు  తమ రాష్ట్రానికి కేటాయిస్తే... ఆయా రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాలను సరైన అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. అందుకే కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి సరిపడా నిధులు రావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఏ ఏ  రాష్ట్రానికి ఏ ఏ  రంగానికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం నివేదిక తయారు చేయగా... దీనికి సంబంధించిన బిల్లును ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 

 

 

 

 ఇకపోతే భారతదేశంలో రెండో  అతిపెద్ద ఉద్యోగితను కల్పించే రంగమైనా వ్యవసాయ వృద్ధిరేటు రోజురోజుకు పడిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజు రోజుకి తగ్గిపోతున్న వ్యవసాయ వృద్ధి రేటును పెంచేలా... రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో  రానున్న రోజుల్లో భారతదేశంలో వ్యవసాయ వృద్ధిరేటు రెట్టింపు అయ్యేలా.. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎలాంటి న్యాయం చేస్తుందో  తెలియాల్సి ఉంది. 

 

 

 ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు రెండు శాతం మాత్రమే నమోదు అవుతుండటం గమనార్హం. 2002-11 మధ్య జీడీపీలో వ్యవసాయ ఆదాయం 4.4 శాతంగా ఉండగా ప్రస్తుతం 3.1 శాతానికి పడిపోయింది. రోజురోజుకు రైతుల ఆదాయం తగ్గిపోతుండటంతో.. వ్యవసాయం పైన ఆధారపడి ఎంతో పెట్టుబడులు పెడుతున్న రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి వ్యవసాయ వృద్ధి రేటును పెంచేలా కేంద్రం ఆశలు ఉన్నాయి. మరి ఈ బడ్జెట్లో ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: