ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే ఇంకేదైనా పెద్ద రోగం వచ్చి ప్రపంచాన్ని అంతం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట కొందరు బుద్దికలిగిన పెద్దలు. అంతే కాకుండా వైరస్ వస్తే కంప్యూటర్‌ను ఎలా ఫార్మట్ చేసి దాన్ని తొలగిస్తామో సమాజంలో కూడా విచ్చల విడిగా విస్తరిస్తున్న చెడుని కూడా అలా ఫార్మట్ చేసే సాంకేతికత ఉంటే బాగుండునని కొందరు అభిప్రాయ పడుతున్నారట.

 

 

ఇలా ఎందుకు జరుగుతుందంటే, చిన్న కడుపు ఉన్న జంతువులు, పక్షులు, కౄరమృగాలు వాటి ఆకలి తీర్చుకుని కనీసం అక్కడి నుండి వెళ్లిపోతాయి. మరలా ఎప్పటికో ఆకలైనప్పుడు మాత్రమే అవి వేటకు బయలుదేరతాయి. కానీ ఇప్పుడు సమాజంలో మనిషి అని చెప్పుకునే మృగం మాత్రం, తన మెదడులోకి బుద్ధి అనే మాయ ప్రవేశించినప్పటి నుండి మంచి చెడులు మరచి, ఇతరులకు హాని చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్నట్లుగా బ్రతుకుతున్నాడు. అందుకు నిదర్శనమే ఇప్పుడు లోకంలో చెలరేగిపోతున్న అరాచకాలు. మనిషిని మనిషే పీక్కుతినే రోజులు వస్తాయని బ్రహ్మం గారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు.

 

 

అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు పరిస్దితులు మారుతున్నాయి. లేకపోతే మనుషుల్ని, జంతువులకన్న హీనంగా చంపడం. మగవారు మగవారినే అత్యాచారాలు చేయడం. దోపిడీలు, దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు ఇప్పుడు ఎటువైపు చూడు మంచి నశించి చెడు విజృంభిస్తుంది. ఇక ఇలా చెడు చేసే వారిపట్ల ఎంత కఠినంగా వ్యవహరించిన మార్పుమాత్రం రావడం లేదు. అందుకు ఉదాహరణ ఇదిగో ఇప్పుడొక దారుణ ఘటన కర్నూలు జిల్లా అవుకులో వెలుగు చూసింది. ఒక బాలుడిపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన పలువురిని కలిచి వేస్తుంది.

 

 

ఇక ఈనాటి వికృత పోకడలకు ఇది నిదర్శనం. దీనిపై బాలుడి తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితులను పోలీసులు గుర్తించారు. బుల్లెట్ రాజు, ప్రేమ కుమార్, సునీల్, రాజు గా పోలీసులు గుర్తించారు. నిందితులపై గతంలో రౌడీ షీట్ కూడా ఉంది. నిందితుడు బుల్లెట్ రాజుపై బాంబుల కేసు కూడా ఉంది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ బాలుడ్ని లైంగికంగా వేధిస్తూ వీడియో తీయడం వీరి మానసిక స్దితికి అద్దం పడుతుంది. ఇలాంటి వారు సమాజానికి చీడలాంటి వారు కాబట్టి సరైన దిశలో ఇంతటి నీచులపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ప్రజలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: