చంద్రబాబునాయుడు బావమరది కమ్ వియ్యంకుడు  నందమూరి బాలకృష్ణకు పెద్ద షాక్ తగిలింది. అదికూడా తన నియోజకవర్గం హిందుపురంలోనే కావటం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నందుకు బాలయ్యకు నిరసనను ఎదుర్కోవాల్సొచ్చింది. చాలా కాలం తర్వాత బాలయ్య నియొజకవర్గంలో పర్యటించేందుకు హిందుపురంకు వచ్చారు.  ఆయన వస్తున్న విషయం ముందే తెలుసుకున్న స్ధానికులు ఆయన కార్యాలయం దగ్గర భారీ ఎత్తున గుమిగూడారు.

 

బెంగుళూరు నుండి హిందుపురంలోకి బాలయ్య అడుగుపెట్టగానే ఆయన కారుకు ఆందోళనకారులు అడ్డుపడ్డారు. రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ పెద్ద ఎత్తున కేకలు మొదలుపెట్టారు. కొందరైతే బాలయ్య ప్రయాణిస్తున్న కారుమీదకు దాడి చేయటానికి కూడా ప్రయత్నించారు. నిరసకారుల నుండి బాలయ్యకు ఇబ్బందులు వస్తాయని ఊహించిన టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా బాలయ్య కాన్వాయ్ దగ్గరకు చేరుకున్నారు. దాంతో ఇరువైపుల చాలాసేపు తోపులాటలు జరిగింది.

 

సరే పోలీసుల జోక్యంతో బాలయ్య సేఫ్ గానే వెళ్ళిపోయారు లేండి. కాకపోతే బాలకృష్ణ ప్రయాణం చేసినంత దూరం నిరసనకారులు వెంటాడుతునే ఉన్నారు. బాలకృష్ణకు వ్యతరేకంగా పెద్దగా కేకలు వేస్తు అనుసరించారు. దాంతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోయింది అందరిలో.

 

నిజానికి మూడు రాజధానులపై బాలయ్య నోరిప్పి ఇంత వరకూ బహిరంగంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. కాకపోతే  చంద్రబాబు చేస్తున్న ఆందోళనలకు బాలయ్య కూడా మద్దతుగా నిలబడ్డారు. అంటే పరోక్షంగా  జగన్ ప్రతిపాదనను బాలకృష్ణ కూడా వ్యతిరేకిస్తున్నట్లే అర్ధమవుతోంది. ఏం చేస్తాడు మరి స్వయంగా బావగారే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నపుడు ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడకుండా కూర్చోవాల్సిందే కదా ?

 

తనకేమీ పట్టనట్లు కూర్చున్నందు వల్లే ఇపుడు ఆందోళనకారులు బాలయ్యకు నిరసనసెగల రుచి చూపించారు. బహుశా మూడు రాజధానుల ప్రకటన తర్వాత బాలయ్య సొంత నియోజకవర్గంలో పర్యటించటం ఇదే మొదటిసారేమో. అందుకనే ఇంత పెద్ద ఎత్తున నిరసనను ఎదుర్కోవాల్సొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: