నిర్భయ కేసు.. ఇంకా ఎన్ని రోజులు.. వింటుంటే విరక్తి పుడుతుంది. ఎన్నిసార్లు ఈ కేసు రీఓపెన్ అవుతుంది? దేశం అంత సంచలనం సృష్టించిన ఘటన ఈ నిర్భయ ఘటన. అలాంటి ఈ ఘటన జరిగి 8 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఉరి శిక్ష పడింది. అంత బాగుంటే ఈ నెల 22నే ఈ ఉరి శిక్ష పడాల్సింది. 

 

కానీ ఆ నిందితులు ఇంకా 10 రోజులు భూమిపై బతికే నూకలు ఉండబట్టి.. వారి రివ్యూ పిటిషన్ కారణంగా ఆ ఉరి శిక్ష కాస్త ఫిబ్రవరి 1వ తేదికి వాయిదా పడింది. అయితే ఈ నిందితులు ఉరి శిక్ష నుండి తప్పించుకోడానికి విశ్వా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ప్రయత్నంగా నలుగురు నిందితుల్లో ఒకరు ఈరోజు మళ్లీ ఢిల్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు. 

 

ఫిబ్రవరి 1న ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునేంత వరకు ఉరిశిక్ష అమలు చెయ్యకూడదని ధర్మాసనాన్ని కోరాడు. ఈ మేరకు నిందితుల తరపు లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ ట్రయల్‌ కోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారణ జరపనుంది. 

 

మరి ఈ విచారణలో ఎం జరగనుంది.. అసలు ఈసారైనా వీరికి ఉరి శిక్ష పడుతుందా? ఇంతటి దారుణాలు చేసిన ఈ నీచులకు ఉరి శిక్ష పడటానికి ఇంత ఆలస్యం ఎందుకు ? అని ఎన్నో సందేహాలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. అంతేకాదు ఈ నిందితులు ఇప్పటికే పిటిషన్లపై పిటిషన్లు వేసుకొని దొంగనాటకాలు ఆడుతున్నారు. 

 

తప్పు చేశాం అనే భావన వారికీ ఏ మాత్రం లేదు.. 8 సంవత్సరాలు గడచిన వారిలో ఏ పక్షతాపం లేదు.. జైల్లో ఉన్న కండలు పెంచి సినిమా హీరోల్లా తయారు అయ్యారు ఈ నీచులు. ఇలా కనీస పశ్చాతాపం లేని వారిని శిక్షించడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: