జనసేన పార్టీ నుంచి మరో నేత తప్పుకున్నారు.  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్బై చెప్పేశారు . తన రాజీనామాకు సంబంధించిన లేఖను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు జెడి లక్ష్మీనారాయణ. ఈ లేఖలో తన రాజీనామా గల కారణాలు కూడా తెలిపారు. ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారినది . జేడీ రాజీనామాతో పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తాను సినిమాల్లోకి వెళ్ళను అని పలుమార్లు చెప్పారని... తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం అని... సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదు అంటూ ఎన్నో సార్లు తెలిపారు అంటూ జెడి లక్ష్మీ నారాయణ ఆరోపించారు..

 

 

 అయితే జేడీ  లక్ష్మీ నారాయణ పార్టీ నుంచి పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ కు ఏమైనా నష్టం జరుగుతుందా అంటే... భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేడీ లక్ష్మీనారాయణ పార్టీలో కొనసాగడం వల్ల జనసేన పార్టీకి ఏమైనా కలిసొచ్చిందా  అంటే..లేదనే అంటున్నారు అందరు . ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ ఎప్పుడూ జనసేన పార్టీలో నిలకడగా ఉంది లేదు. అటు అధికార వైసీపీ పార్టీలో కూడా చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. టిడిపిలో చేరేందుకు కూడా ప్రయత్నించారు. చివరికి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని  కూడా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తిరిగి ఇటు తిరిగి మొత్తానికి జనసేన గూటికి చేరారు జేడీ  లక్ష్మీనారాయణ.

 

 

 ఇక జనసేనలో చేరిన తర్వాత విశాఖ ఎంపీగా పోటీ చేశారు జెడి లక్ష్మీనారాయణ. ఇక జేడీ లక్ష్మీనారాయణ చరిష్మా తో తప్పకుండా విశాఖ ఎంపీ స్థానం గెలుస్తారని జనసేన పార్టీ నుంచి గెలిచే  మొదటిస్థానం విశాఖనేనంటూ అప్పట్లో తెగ  ప్రచారం జరిగింది. కానీ విశాఖలో ఎంపీ స్థానంలో గెలవడం కాదు కదా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు జేడీ లక్ష్మీనారాయణ. ఇదంతా చూస్తుంటే జనసేన పార్టీలో  జేడీ లక్ష్మీనారాయణ ఉండడంవల్ల పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చింది ఏమీ లేదని అర్ధం అవుతుంది. మరి జనసేన పార్టీని జేడీ వీడటం వల్ల పవన్ కళ్యాణ్ కు ఏమైనా నష్టమా అంటే అది కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో రాజకీయాలు చేసుకుంటూ మరోవైపు సినిమాలు చేసుకుంటూ హాయిగా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే జెడి కారణంగా జనసేన పార్టీకి నష్టం కానీ లాభం కానీ ఏమి  లేవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: