చైనా లో పుట్టిన ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ప్రాణ భయంతో వణికిస్తున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా చైనాలో  వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా  వైరస్ బారినపడి వందకు పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా ఎంతోమంది కరోనా  వైరస్ బారినపడి... ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కరుణ వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఉండడంతో అటు  ప్రపంచ దేశాలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. తమతమ దేశాల్లో కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చైనా దేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దేశంలోకి అనుమతిస్తున్నారు. పలు దేశాలు చైనా కు వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేసుకున్నారు. 

 

 

 కరోనా  వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఆంటీ వాక్సిన్  కోసం పరిశోధనలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహ చేసిన ఆస్ట్రేలియా లోని ప్రభుత్వ పరిశోధన విభాగంలో కరోనా  వైరస్కు సరైన వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2019 సంవత్సరం లోనే ఎంసీఓవీ  పిలుస్తున్న... కరోనా  వైరస్ పై  ప్రత్యేకంగా పరిశోధనలు జరగడం లేదు. ఇదివరకే మానవాళిపై దాడి చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న సార్స్ మెర్స్  వ్యాధులు కూడా కరోనా వైరస్ కారణంగా వచ్చాయని వైద్యులు ప్రధానంగా నిర్ధారించారు.కాగా దీని కోసం  వాక్సిన్ కనుగొనడానికి పరిశోధనలు చేస్తున్నారు. 

 

 

 అయితే దీనికి సంబంధించిన వాక్సిన్  కు సంబంధించి రెండు దశాబ్దాల క్రితమే పరిశోధన ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు మానవులపై ప్రయతించేంత   స్థాయికి ఈ పరిశోధన  చేరుకోలేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న వాక్సిన్ ని  ముందు ఎలుకలపై ఆ తర్వాత మానవులపై ప్రయోగం చేయనున్నారు . ఆ తర్వాత ఈ మందు అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదంతా  జరగాలంటే 4 నెలల సమయం పట్టక తప్పదు అను పరిశోధన చేస్తున్న వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: