ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది త కరోనా  వైరస్.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ప్రాణభయంతో ఊగిపోతున్నారు. చైనాలో అతి వేగంగా నగరాల్లో వ్యాప్తిచెందుతుంది కరోనా  వైరస్. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి వంద మందికిపైగా చైనాలో ప్రాణాలు సైతం కోల్పోయారు . ఇక మిగతా దేశాల్లో కూడా కరోనా  వైరస్ సోకినట్లు పలువురు అనుమానితులు  ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ పేరు తలుచుకుంటేనే ప్రజలు భయంతో వనకాల్సిన  పరిస్థితి ఏర్పడింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆయా దేశ ప్రభుత్వాలు కూడా కరోనా  వైరస్ తమ  దేశంలోకి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

 

 

 అయితే ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది కరోనా వైరస్ సోకినట్లు  అనుమానం రావడంతో ఆస్పత్రిలో వైద్యులు  ప్రత్యేకంగా చికిత్స చేస్తూ వారి నమూనాలను నపూణెకి  పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చైనా నుండి ఇండియాకు వచ్చిన విద్యార్థికి కరోనా  వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. కేరళకు  చెందిన ఓ విద్యార్థికి కరోనా  వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించడం తో ప్రస్తుతం దేశ ప్రజలందరి లో కొత్త భయం పట్టుకుంది. కేరళ వరకు వచ్చిన కరోనా  వైరస్ ఎక్కడ తమ వద్దకు వచ్చి  ప్రాణాలను హరిస్తోందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుజాగ్రత్త చర్యలు  చేపట్టాయి. 

 

 

 కాగా ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్  సోకినట్లు అనుమానితులకు  కు చికిత్స అందిస్తున్నారు... కేరళ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసు నమోదు కావడం.. లాంటివి జరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయిపోయింది.  కరోనా  వైరస్ను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.  నాలుగు రిఫరల్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులు  ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి కూడా భక్తులు రానుండగా... మేడారం జాతరపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: