వెనకటికి చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. ఇప్పుడు చైనా పరిస్దితి అచ్చం ఇలాగే తయారు అయ్యింది.. అభివృద్ధి పథంలో అందుకోలేనంతగా ఎదుగుతున్న చైనా ప్రపంచదేశాలను శాసించే స్దాయిలో ఉండాలని ఎప్పుడు ఆశపడుతుంది. ముఖ్యంగా అమెరికా విషయంలో అయితే ఇది సృష్టంగా కనిపిస్తుంది. ఇక పోతే టెక్నాలజీ పరంగా కూడా చైనా దేశాన్ని అందుకోలేనంత ఎత్తులో ఎదిగింది. ప్రపంలో ఏదైన కొత్త వస్తువు మార్కెట్‌లోకి వచ్చిందంటే దానికి మూలాధారం చైనా. ఇప్పుడు దాదాపుగా ప్రతి దేశం వాడుతున్న వస్తువులు ఎక్కువగా చైనా నుండి ఉత్పత్తి అవుతున్నవే. ఇకపోతే ఇంతటి పేరు ప్రతిష్టలు సాధించిన చైనా ఒక వైరస్‌కు మందు కనిపెట్టలేకపోతుందన్న విషయం నమ్మాలంటే కూడా హస్యాస్పదం అనిపిస్తుంది.

 

 

అయితే ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతున్న కరోనా వైరస్ విషయంలో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయట. అదేమంటే అసలు కరోనా వైరస్ ఎలా బయటకు వచ్చింది…? ఎప్పుడో 1966 లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఎందుకు వణికించే పరిస్థితి ఏర్పడింది…? సాంకేతిక, వైద్య రంగాల్లో ప్రపంచంతో పోటీ పడే చైనా ఈ వైరస్ ని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది…? ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు కనుకున్న చైనా వాసులు దీనికి ఎందుకు వ్యాక్సిన్ ని కనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు…? ప్రపంచ వ్యాప్తంగా ఇది విస్తరించడం వెనుక అసలు కారణాలు ఏంటీ…? అని ప్రశ్నిస్తే ప్రపంచదేశాల చూపులన్ని చైనా వైపే ఉన్నాయి.

 

 

ఎందుకంటే తమ పై ఒక వేళ ఏదైనా దేశం దాడి చేస్తే దానిమీద జీవరసాయన దాడి చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే కాకుండా జీవ రసాయన ఆయుధాల మీద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. కాని ముఖ్యంగా అమెరికా మీద పెత్తనం చేలాయించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చైనా చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకుంటుందనే వాదన కూడా వినిపిస్తుంది.  ఇకపోతే సూర్య హీరోగా వచ్చిన సినిమా 7వంత్ సెన్స్ 26 అక్టోబరు 2011 న విడుదలైన ఈ సినిమా కధలో జరిగిన విధంగానే ఇప్పుడు చైనాలో జరుగుతుంది. ఈ కధను కూడా చైనా దేశాన్ని బేస్ చేసుకునే రాసుకున్నారు. ఇప్పుడు అక్కడ జరిగే పరిస్దితులు అచ్చంగా ఈ సినిమాను తలపిస్తున్నాయి.

 

 

ఇక ఇందులో అందరు అనుమాన పడుతున్న విషయం ఏంటంటే ఈ వైరస్‌ను చైనా దేశమే వ్యాపింపచేసిందా. ఇలాంటి అనుమానం కలగడానికి బలమైనా కారణం ఏంటంటే ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాధికారక వైరస్‌, బాక్టీరియాలను పరిశీలించే ప్రయోగశాలల వ్యవస్ధ ఉంది. ఈ దేశంలో పన్నెండు ప్రధాన ప్రయోగశాలలు, 91 ప్రాంతీయ, 800 ఆసుపత్రుల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికి తెలిసిన 300 వ్యాధికారక వైరస్‌లను అక్కడ వెంటనే గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయి. 2003 సారస్‌ విస్తరణ తరువాత వీటిని మరింత పటిష్ట పరిచారు. గుర్తు తెలియని వైరస్‌లను గుర్తించే పరిశోధనలు ఎన్నో ఇక్కడ చేస్తారు..

 

 

ఇకపోతే సారస్‌ తరువాత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించేందుకు 17ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇచ్చారు. ఇంతటి వ్యవస్దను తన దగ్గర పెట్టుకున్న చైనా, చేస్తున్న పరిశోధనల నుండి అ వైరస్ అక్కడ లీక్ అయి ప్రమాదవ శాత్తు బయటకు వచ్చి అక్కడ పని చేస్తున్న ఇద్దరికి సోకి, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి౦ది. దీని వలన చైనానే ఎక్కువగా నష్టపోతుంది. ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా ఇప్పుడు ఇది కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఇకపోతే, ఇదివరకు వచ్చిన ఎబోలా, ఆంత్రాక్స్, సార్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ లాంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ల జాబితాలోకి ఇప్పుడు కరోనా కూడా చేరింది. ఇవి అన్ని కూడా బయోవార్ లో భాగంగా బయటకు వచ్చి అమాయక పౌరుల ప్రాణాలను తీస్తున్నవే. ఇక ఇప్పుడు కలుగుతున్న అనుమానాలు ఏంటంటే చైనానే  ఆర్ధికంగా బలపడటానికి ఈ వైరస్ ని విడుదల చేసి.. తనకు తానే నష్టపోయిందా అనిపిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: