సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీనారాయణ పనిచేసినప్పుడు జనాల్లోనూ మీడియాలోనూ ఒకరమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఎంత నిజాయితీగల అధికారిగా పేరు తెచ్చుకున్నాడో అంతే స్థాయిలో అప్రదిష్ట కూడా మూట గట్టుకున్నాడు. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి జేడీ వ్యవహారంపై కొంచెం కొంచెం అనుమానాలు రేకెత్తించింది. దీనిపైనే అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిపడ్డాయి. అయితే పెద్దగా వీటిని హైలెట్ చేసేందుకు ఎవరూ సాహసించలేదు. ముఖ్యంగా కొంతమంది పార్టీల నాయకులతోనూ, మీడియా అధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని ఆయన దర్యాప్తులో ఆ ప్రభావం చూపిస్తున్నారని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. 


ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కి ఆయన జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించిన వివరాలను లీక్ చేసినట్టుగా ఆయన మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. 
కేవలం ఒక పార్టీని, ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేసుకుని ఆ పార్టీకి వ్యతిరేకంగా మీడియాను ప్రభావితం చేయడంలో బాగా శ్రద్ద తీసుకున్నట్టు కూడా ఆయన మీద అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ మహిళకు ఎక్కువ ఫోన్ కాల్స్ చేయడం, ఆమెతో ప్రవేట్ సంభాషణ ఇలా ఎన్నో గాసిప్స్ ఆయన మీద వచ్చాయి. ఇవన్నీ అప్పట్లో మీడియాలో హైలెట్ అవ్వగా వాటిని కొట్టిపారేశారు జేడీ. ఇక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత కొంతకాలం ఏ పార్టీలో చేరకుండా కాలక్షేపం చేశారు. ఆ తరువాత రైతుల కోసం తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. 


ఒక దశలో జేడీ సొంతంగా పార్టీ పెడుతున్నారని అంతా భావించారు. కానీ ఆ ప్రయత్నాన్ని ఆయన విరమించుకున్నారు. ఇక ఆయన రకరకాల పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేసారు. టీడీపీ లో చేరేందుకు కూడా ప్రయత్నించారని కానీ జనాల్లో వ్యతిరేకత రావడంతో పాటు ఇప్పటివరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది అనే భయంతో ఆ పార్టీలో చేరారని ఆయన మీద ప్రచారం జరిగింది. ఇక వేరే రాజకీయ ప్రత్యామ్న్యాయం లేక జనసేన పార్టీలో ఆయన చేరినట్టుగా ఆయన సన్నిహితుల ద్వారా అప్పట్లో బయటపడింది. 


రైతుల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినా రైతుల కోసం ఆయన చేసింది కూడా ఏమీ లేదు, ఇక మంచి పోలీసు ఆఫీసరుగా పేరు సంపాదిద్దామని తాపత్రయపడినా చివరకు ఎన్నో నిందలు మీద వేసుకున్నారు. ఇక ఇప్పుడు జనసేనకు రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరతారా క్లారిటీ లేకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: