వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. సంచలనానికి మరో పేరు.. ఒక ట్విట్ పెడితే చాలు అటుపక్క ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఓ సంచలన ట్విట్ పెట్టారు. ఆ ట్విట్ చూస్తే చంద్రబాబుకు గుండె ఆగడం ఖాయం.. ఆలా ఉంది ఆ ట్విట్..             

 

అందులో ఏముంది అంటే.. చంద్రబాబు నాయుడు స్వభావం ఉంది.. చంద్రబాబు నాయుడు ఎలా అయితే ఉంటారో దాని గురించి చాలా చక్కగా వివరించాడు విజసాయయి రెడ్డి. అంతేకాదు.. సీఎం జగన్ స్వభావం గురించి.. అయన గొప్పతనం గురించి ఒక్క ట్విట్ లో చెప్పేశారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.    

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''నేను విన్నాను. నేను ఉన్నాను’ అనగానే సిఎం జగన్ గారు గుర్తుకొస్తారు. మానవత్వానికి నిలువెత్తు శిఖరంలా నిల్చి, మాట కోసం ప్రాణమిచ్చే స్వభావం ఆయనది. ఏం పిచ్చపిచ్చగా ఉందా? నన్నే ఎదిరిస్తారా? తోకలు కత్తిరిస్తా. మీరు అడిగిన దానికల్లా తలూపాలా? ఏమనుకుంటున్నారసలు. ఇదీ చంద్రబాబు ఇమేజ్.'' అంటూ సంచలన ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: