ఈమధ్య బయట మాంసం తినాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మామూలుగా అందరూ తినే చికెన్ మటన్ పేరు చెప్పి వేరే జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇలా మటన్ చికెన్ పేరు చెప్పి ఇతర జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్న కథనాలు ఎన్నో తెర మీదికి వచ్చాయి. తాజాగా ఇలాంటి కథనం మరొకటి తెరమీదికి వచ్చింది. చికెన్ మాంసం లో కాకి మాంసం కలిపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చికెన్ మాంసం లో కాకి మాంసాన్ని కలిపి వివిధ వెరైటీలను తయారు చేస్తూ వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వారిని పోలీసులు కటకటాల వెనుకకు తోసారు . తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది ఈ ఘటన.

 

 

 వివరాల్లోకి వెళితే... రామేశ్వరం లోని ఓ ఆలయంలో భక్తులు తమ పూర్వీకులకు జ్ఞాపకార్థం... అక్కడ ఉన్న కాకులకు అన్నాన్ని ఆహారంగా వేసేవారు. అయితే ఇక్కడ భక్తులు వేసిన ఆహారాన్ని తరచూ ఎక్కువ మొత్తంలో కాకులు వచ్చి తింటూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఇలా వేసిన అన్నం తిన్న కాసేపటికే ఎక్కువ సంఖ్యలో కాకులు  చనిపోవడం జరిగింది. దీంతో ఆందోళన చెందిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. ఇక భక్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి . వేటగాళ్లు కాకులకు మద్యం కలిపిన ఆహారాన్ని ఇవ్వడం వల్లే భారీ సంఖ్యలో కాకులు చనిపోయాయని  పోలీసుల విచారణలో తేల్చారు.

 

 

 ఇక చనిపోయిన కాకులను సేకరించి వాటి మాంసాన్ని చికెన్ స్టాల్స్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాకి మాంసాన్ని చికెన్ మాంసం తో కలిపి వివిధ వెరైటీ లతో కొందరు దుకాణదారులు రోడ్డు పక్కన తినుబండారాలు ఉపయోగిస్తున్నట్లు గా పోలీసులు విచారణలో తేలింది. కాగా కాకులను భారీ మొత్తంలో చంపడమే కాదు...  వాటి మాంసాన్ని చికెన్ స్టాళ్లకు  విక్రయించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారుగా 150 చనిపోయిన కాకులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డు పక్కన ఉండే తినుబండారాలలో మాంసం  తినాలి అంటేనే భయపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: