పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఈ శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు కాగా. .. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యొక్క ఆంక్షలు, ఆశయాలను వివరించారు.. 17వ లోక్‌సభ పలు చారిత్రాత్మక నిర్ణయాల అమలుకు వేదికగా నిలిచింది... ఈ సభ ఏర్పడిన ఏడు నెలల్లోనే కీలక నిర్ణయాలను తీసుకుందని కేంద్రంపై ప్రశంసలు కురిపించారు...ప్రజలు కూడా సుముఖంగానే స్పందించారు... పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్నారు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ భారత్ ముందంజలో ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.

 

ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. 24 మంది పేదలకు బీమా సౌకర్యం కల్పించామని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం చారిత్రాత్మకం.. అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను రద్దుచేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలకు అన్ని సౌకర్యాలను సమకూర్చామని తెలిపారు. . రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పలు చర్యలు తీసుకున్నామని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులకు లబ్ది చేకూరిందని అన్నారు.వ్యవసాయం అనేది దేశానికీ వెన్నుముక లాంటిది.. రైతు బాగుంటే దేశం బాగుపడుతుంది.. ఈ ఏడాది కొత్తగా మరో 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నామని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, ప్రజలకు మేలుచేకూర్చే కొత్త కార్యక్రమాలను ప్రారంభించదని రాష్ట్రపతి వివరించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మూల మంత్రంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు..
దివ్యాంగులకు ఇ-గుర్తింపు కార్డులు జారీచేశామన్నారు.

జనరిక్ ఔషధాల కేంద్రాలను ఏర్పాటుచేసి పేదలకు వైద్య ఖర్చులను తగ్గించామని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టే చంద్రయాన్-3, గగన్‌యాన్, ఆదిత్య మిషన్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే, పాకిస్థాన్‌లో మైనార్టీలపై జరుగుతోన్న హింసను రాష్ట్రపతి తీవ్రంగా ఖండించారు.. ఈ విషయం పై తాగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: