త్వరలోనే ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేచి చూస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రపంచ రాజకీయాలు ఇండియాకు వ్యతిరేకంగానే కొనసాగుతున్నాయి. అలాగే జి.డి.పి వృద్ధి రేటు తీవ్ర తగ్గుదల మన దేశ ఆర్థిక వ్యవస్థకి సమస్యగా మారింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపుల విషయం ఒక పెద్ద సవాలుగా మారింది.


ఇకపోతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని మాత్రమే రాజధానిగా భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనికి శంకుస్థాపన కూడా చేశారన్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో రాష్ట్ర రాజధానికి రూ. 47,424 కోట్లు అవసరమవుతాయని కేంద్ర ఆర్థిక సంఘానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటికే రాజధాని నిర్మాణం కొరకై ఆరు వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రస్తావన తీసుకువచ్చారు. పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండే విధంగా బిల్లు ఆమోదం కూడా పొందింది. సచివాలయ కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా కొనసాగగా... అసెంబ్లీ అమరావతిలో ఉండనుంది.



అయితే తాజాగా చోటు చేసుకున్న ఈ రాష్ట్ర రాజధానులు పరిమాణాల పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందా లేదా అనే సందేహం బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత తెలుస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకైతే దాదాపు బిజెపి నాయకులంతా మూడు రాజధానుల నిర్ణయంపై పాజిటివ్ గానే స్పందిస్తున్నారని సమాచారం. అయితే ఈ మూడు రాజధానుల అభివృద్ధి కొరకు కేంద్రం నిధులను ఇస్తుందా ఇవ్వదా అనే డైలమా ఏర్పడింది. ఒకవేళ నిధులను ప్రకటిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉందని తెలుస్తోంది. మరి సమీప భవిష్యత్తులో బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానులకు నిధులు కేటాయించబడతాయో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: