కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వెల్లపటూరు సమీపంలో సమత అనే వివాహితను కామంతో కళ్ళు  మూసుకుపోయిన మానవ మృగాలు  అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన కంటే మూడు రోజుల ముందు ఈ ఘటన జరిగింది. ఈరోజు ఘటన  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా  ఈ ఘటన జరిగిన కేవలం 45 రోజుల్లోనే సమతా  అత్యాచారం హత్య కేసులో నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇది రికార్డు గా మారింది. కాగా సమత అత్యాచారం హత్య కేసులోని ముగ్గురు నిందితులను  త్వరలో ఉరితీయాలి అన్నారు. 

 


 అయితే దాదాపుగా నాలుగు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో  ఉరిశిక్ష చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అదిలాబాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేయగా ఆ శిక్ష ఎక్కడ అమలు చేయనున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... 1978 సంవత్సరంలో చివరిసారిగా ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉరి శిక్ష అమలు అయింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ  ఉరి శిక్ష అమలు కాలేదు. ఇక కాలక్రమంలో ముషీరాబాద్ జైలు కాస్త చర్లపల్లి కి తరలి పోవడం జరిగింది. చర్లపల్లి జైలు లో మాత్రం ఉరిశిక్ష అమలు చేసేందుకు అవకాశం లేదు. 

 


 సమతా అత్యాచారం హత్య కేసులో ముగ్గురు నిందితులతో పాటు తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు సహా  మరో రెండు  ఘటనలకు సంబంధించిన నిందితులకు ఉరి శిక్షలు ఖరారయ్యాయి. ఇకపోతే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  ఉరికంబం ఉన్న జైలు ఉన్నాయి.  మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటిది ఏదీ లేదు. ఇప్పుడు వరకు తెలంగాణలో జైల్లో ఉరి కంబాల పై చర్చ జరిగినప్పటికీ.. ఉరి కంబాల ఏర్పాటు మాత్రం జరగలేదు. ఇంతకు మునుపు కేసులో ఉరిశిక్ష పడిన దోషులను రాజమండ్రి జైలులో ఉరితీశారు. ఈ నేపథ్యంలో సమతా కేసులోని నిందితులను ఎక్కడ ఉరితీయ పోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: