మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట బిజెపి శివసేన కూటమి మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా సీట్లు గెలిసినప్పటికీ... శివసేన పార్టీకి రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని అంటూ శివసేన డిమాండ్ చేయడంతో ఈ పొత్తు  విబేధించింది. ఆ తర్వాత ఈ రెండు పార్టీల  మధ్య ఎన్నో చర్చలు జరిగినప్పటికీ ఏది ఫలించలేదు. ఇక చివరికి బిజెపి ముందడుగు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ... బిజెపి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చాలని భావించిన కాంగ్రెస్ పార్టీ శివసేనకు  కు మద్దతు పలకడంతో కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతుతో శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

 

 

 అయితే తాజాగా శివసేన తో బిజెపి మళ్లీ కలవాలని   భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిజెపి పార్టీ శివసేనకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కోరితే శివ సేన తో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత సుధీర్ మునగంటి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన ఇప్పటికీ తమ మిత్రపక్షమేనని  అని తెలిపిన సుధీర్ మునగంటి... శివసేన బీజేపీ సిద్ధాంతాలు ఒక్కటేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్సిపి లు శివసేన  తో విభేదించినప్పటికీ తాము మద్దతు ఇస్తాము అంటూ స్పష్టం చేశారు.

 

 

 

 శివసేన పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేది 21 శతాబ్దంలోనే వింత అంటూ వ్యాఖ్యానించిన బీజేపీ సీనియర్ నేత సుధీర్ మునగంటి.. బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్  ఈ కుట్ర చేసింది అంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత సుధీర్ మునగంటి  చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో గతంలో శివసేన  తో విభేదించినప్పటికీ  మరోసారి పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు అర్థమైంది. ఒకవేళ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు  శివసేన తో విభేదాలు వచ్చి మద్దతు ఉపసంహరిస్తామంటే...  వెంటనే తాము మద్దతు ఇచ్చి  శివసేన పార్టీని తమ వైపు తిప్పుకోవాలని... దారిలోకి తెచ్చుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నట్లు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: