ప్రస్తుతం పొల్యూషన్ ఎన్ని రకాలు ? నాలుగు రకాలు. అవి అన్ని కలిసి ఎక్కడ ఉన్నాయి అంటే? నిర్మొహమాటంగా చెప్పచ్చు. ముంబై అని. ముంబైలో ఉండే ట్రాఫిక్ మరెక్కడా ఉండదు. ముంబై ట్రాఫిక్ లో ఒక్కసారి చిక్కుకున్నాం అంటే చెవులు బద్దలు అవ్వాల్సిందే.. అలా ఉంటుంది అక్కడ ట్రాఫిక్.  

 

ఎందుకంటే.. లక్షలాది మంది ప్రజలు ప్రస్తుతం వాహనాలు నడుపుతున్నారు.. కొంచం ట్రాఫిక్ అయితే చాలు వూరికే వూరికే హారన్ కొడుతారు. శబ్దకాలుష్యానికి కారణమవుతారు. అదేం అంటే.. టైం లేదు అంటారు.. సిగ్నల్ పడిన ఆగారు.. వారికే వాహనం ఉన్నట్టు హారన్ కొడుతారు. దింతో అక్కడ ట్రాఫిక్ సిబ్బందికి చెవి పోటు వస్తుంది.. దాంతో తలనొప్పి. 

 

అందుకే అక్కడ ముంబై పోలీసులు ఓ సరికొత్త పరిష్కారం ఆలోచించారు. అది ఏంటి అంటే.. సిగ్నలింగ్ వ్యవస్ధకు డెసిబెల్స్‌ మెషీన్లతో అనుసంధానం చేశారు. దీంతో వాహనదారులు హారన్ కొట్టకుండా ఫుల్ స్టాప్ పెట్టారు. అది ఎలా అంటే.. సిగ్నల్ పడిన సమయంలో హారం కొట్టారు అంటే ఆ హారన్ బెల్స్ డెసిబెల్స్‌ మీటర్‌లో 85 కంటే ఎక్కువ నమోదు అవుతే మళ్లీ రెడ్‌ సిగ్నల్‌ పడుతుంది. 

 

దీంతో కథ మళ్ళి మొదటికి వస్తుంది. అందుకు అని ఎవరి దారిన వారు సైలెంట్ గా హారం కొట్టకుండా వెళ్ళిపోతే ఏ సమస్య ఉండదు. కానీ హారన్ కొట్టారు అంటే మాత్రం రెడ్ సిగ్నల్ పడుతుంది. మల్లి నిమిషం ఆగాలి. ఈ ప్రయోగం ప్రస్తుతం ముంబైలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇది తెలంగాణాలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకొద్దాం అని మంత్రి కేటిఆర్ ఆసక్తికరమైన ట్విట్ పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: