బడ్జెట్ 2020 .. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అండి సామాన్యులు. సామాన్యుల కళలపై నీళ్లు జల్లారు.. ప్రజలను నిరాశ పరిచారు. నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ వృద్ధి రేటు రానున్న ఆర్థిక సంవత్సరం 2020-21కు 6నుంచి 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసినట్టు చెప్పారు. 

 

మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2025 సంవత్సారానికి దేశం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సర్వే పై రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హర్షం వ్యక్తం చేశారు. కాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. 

 

అయితే రేపు ఫిబ్రవరి 1న ఉదయం 11.గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి అందరికి  తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను తెలుసుకోవడంలో ఆర్థిక సర్వే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 

 

కాగా ఈ సమావేశంపై ప్రజలు.. ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నాయి. 10శాతం వృద్ధి రేటు ఎప్పుడు చూస్తామో ఓ నెటిజన్ కామెంట్ చెయ్యగా మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వమే నయం.. అయితే ఈ ఆర్థిక సెర్వేపై పలు రకాల విమర్శలను ఎదుర్కొంటుంది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం. 

 

కాగా ఈ బడ్జెట్ పై సామాన్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అన్ని ధరలు పెరిగాయి.. నిరుద్యోగ యువత ఎక్కువ అయిపోయారు కానీ ఈ బడ్జెట్ కూడా ఏలాంటి మార్పును తీసుకురాలేకపోతుంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బంగారం ధర.. రైతుల కోరికలు ఈ బడ్జెట్ తో ఏవి తీరేలా అనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: