పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బిజెపి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ కి సంబంధించిన అనేక సమస్యలు, నిధుల విడుదల గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.కేంద్రం నుంచి ఏపీకి వివిధ పద్దుల కింద రావలసిన నిధుల గురించి ప్రధానికి వివరించారు. దీనికి సంబంధించి సమావేశాల అనంతరం మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా  రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు.


 ఏపీకి రావాల్సిన 18, 969 కోట్లు రెవెన్యూ లోటు నిధులను మంజూరు చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా వెనకబడిన జిల్లాలకు కేంద్రం అందించాల్సిన సహాయం కింద 23 ,300 కోట్ల నిధులను కూడా వీలైనంత తొందరగా విడుదల చేయాల్సిందిగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రతిష్టాత్మకంగా భవిస్తూ వస్తున్న పోలవరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా దక్కించుకుందని, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన 3223 కోట్ల రూపాయలను రీయంబర్స్మెంట్ కింద ఏపీకి మంజూరు చేయాల్సిందిగా ప్రస్తావించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. 


అదేవిధంగా పోలవరం సవరించిన మొత్తాన్ని కూడా కేంద్రం వెంటనే మంజూరు చేయాల్సిందిగా ప్రదనిని కోరినట్టు విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజధాని నగర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 2500 కోట్లు మాత్రమే ఇప్పటివరకు మంజూరు చేసిందని,  ఇంకా 47, 424 కోట్లు అందించాలని కేంద్రాన్ని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. వీటితో పాటు దుగ్గరాజుపట్నం వీలుకాదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి రామాయపట్నం పోర్టును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేసినట్టు ఆయన చెప్పారు. ఇక కడప జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నామని, పారిశ్రామిక ప్రోత్సాహకాలను నూటికి నూరు శాతం తిరిగి చెల్లించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టుగా విజయసాయిరెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: