ప్రపంచ దేశాల అన్నిటినీ వణికిస్తున్న పేరు కరోనా వైరస్. చైనా దేశం వ్యూహాన్ నగరంలో బయటపడిన ఈ ప్రమాదకరమైన వైరస్ ఇప్పటికే చైనా దేశంలో 200కు పైగా ఆ దేశానికి సంబంధించిన వారిని మృత్యువుకు గురిచేసింది. దీంతో ప్రపంచ దేశాలు అన్నీ చైనా దేశం నుండి వచ్చే ప్రతి వస్తువు మరియు అదే విధంగా పౌరుడు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు చైనా దేశం నుండి రాకపోకలను నిలిపివేశారు. మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందే ఈ ప్రమాదకరమైన వైరస్ వల్ల వ్యాధి సోకిన అనగా వైరస్ సోకిన వ్యక్తి నెల రోజుల లోపే మరణించే అవకాశాలు ఎక్కువ ఉండటంతో అత్యంత తొందరగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ తమ దేశంలో రాకూడదని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు విమానాశ్రయాల్లో ప్రత్యేకమైన వైద్య బృందాలు ఏర్పాటు చేసి మనుషులను క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు దేశం లోకి రాణిస్తున్నారు.

 

చాలా చోట్ల చాలా దేశాల్లో ప్రజలు భయాందోళనలు కలిగి ఉన్నారు కరోనా వైరస్ గురించి వార్త విన్న తర్వాత. ఇటువంటి తరుణంలో ఆస్ట్రేలియన్ సైంటిస్టులు ఈ వైరస్‌పై తొలి విజయం సాధించారని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. తొలిసారిగా వాళ్ళు కరోనా వైరస్‌ను రీ-క్రియేట్ చేసినట్లు దీంతో పలు దీర్ఘకాలిక వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ మైక్ కాటన్ అనే శాస్త్రవేత్త దీనిని కనుగొన్నట్లు ‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఈ నమూనా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియన్ వైద్యబృందం బలంగా నమ్ముతోంది.

 

దీంతో వైరస్ పుట్టడానికి అసలు కారణం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి సులభంగా వ్యాక్సిన్ తయారు చేయడం పెద్ద విషయం కాదని ఆస్ట్రేలియన్ వైద్య బృందం తేల్చిచెప్పింది. దీంతో తాజాగా వైరస్ పుట్టడానికి...కారణం దొరకడంతో రాబోయే రోజుల్లో వైరస్ ని అంతమొందించడానికి సులభంగా మార్గం అతి తక్కువ రోజుల్లోనే దోరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అమెరికాలో ఉన్న వైద్యులు కూడా కరోనా వైరస్ విరుగుడుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: