2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ కావడం విశేషం. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర బడ్జెట్‌ 2020-21 హైలైట్స్ ఇవే..

 

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
రూ" 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు

 

ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
ఆరు లక్షలమంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌పై ప్రత్యేక దృష్టి
మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

 

విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు
ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ
భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్‌ పరీక్షలు
ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కాలేజీ

 

గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి
ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌
రవాణ రంగ అభివృద్ధికి బడ్జెట్‌లో కొత్త వ్యూహాలు
ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం
అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్‌ మ్యూజియం
పర్యాటక అభివృద్ధికి తేజాస్‌ రైళ్లు
రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి
ముంబై-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు
పెద్దసంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్‌ రైళ్లు

 

చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ
ఇకనుంచి యంత్రాలతో సెప్టెక్‌ ట్యాంకుల క్లినింగ్‌
ప్రైవేటు రంగంలో డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు
కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు
ఆప్టికల్‌ ఫైబర్‌ లింక్‌తో లక్షగ్రామపంచాయతీల అనుసంధానం
కొత్తగా ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌..
యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు
ల్యాండ్‌ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌
మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం

 

ఎలక్ట్రానిక్‌, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
మొబైల్‌ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
రంగాలవారీగా కేటాయింపులివే..
జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
విద్యారంగానికి రూ 99.300 కోట్లు
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు

 

టూరిజం ప్రోత్సాహానికి రూ 2500 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు
ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తులు
16 లక్షలమంది రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌
సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
ఈ సారి బడ్జెట్‌ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది
ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన
రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్‌ రైలు ఏర్పాటు
సివిల్‌ ఏవియేషన్‌ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్‌ పథకం
జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌కు చేయూత
ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయం
జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు..

మరింత సమాచారం తెలుసుకోండి: