పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పనిదినంలో  ప్రవేశపెట్టగా ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా ఏమి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అటువంటి విషయాలను పార్లమెంటు ప్రసంగించనున్నారు. అలాగే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం అందించే అవ‌స‌రం ఖ‌చ్చితంగా ఉందన్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చేలా యువతకు ప్రోత్సాహం అందిస్తామ‌న్నారు. 

 

పెట్టుబడి పెట్టే ముందు తగిన శిక్షణ, అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాలు, నూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగం, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కొత్త పథకాలు, మొబైల్‌ ఫోన్ల తయారీ, సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం ప్రత్యేక పథకం, త్వరలో విధివిధానాలు ఉండ‌నున్నాయ‌ని ఆమె తెలిపారు. వీటితో పాటు రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 5 ఆకర్షణీయ నగరాలు, జౌళి పరిశ్రమ మరింత అభివృద్ధికి త్వరలో ప్రత్యేక విభాగం, జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం, చిన్నతరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో కొత్త బీమా పథకం చేప‌ట్ట‌నున్న‌ట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బ‌డ్జెట్ 2020లో భాగంగా పేర్కొన్నారు. 

 

కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కేంద్ర బడ్జెట్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు లోకి వస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: