2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

 

యువ ఇంజినీర్లకు ఉపాధి కల్పిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వైద్య రంగానికి త్వరలో కొత్త విద్యా పాలసీ తీసుకొస్తామన్నారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతామని పేర్కొన్నారు. రూ. 3000 కోట్లు నైపుణ్యాభివృద్ధి కేటాయిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్బంగా డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. త్వరలోనే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రవేశపెడతామని అన్నారు. పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విద్య అందించబోతున్నామని శుభవార్త చెప్పారు. త్వరలోనే నేషనల్ పోలీస్, నేషనల్‌ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

 

కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే మ‌రోవైపు నూతన విద్యావిధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్లైన్‌లోనే చదువుకునే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఈ డిగ్రీ విధానానికి మాత్రం షరతులు వర్తిస్తాయని చెప్పుకొచ్చారు. కేవలం ఈ విద్యావిధానాన్ని దేశంలో పేరుపొందిన 100 జాతీయ విద్యాలయాల్లో మాత్రమే ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మ‌రియు ఇక భారత్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘ఇండ్‌శాట్’ అనే పేరుతో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: