మైండ్ గేమ్ ఆడటంలో ప్రస్తుత రాజకీయ నాయకులు బాగా ఆరితేరిపోయారు. ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా హడావుడి చేయడం, తమ రాజకీయ ప్రత్యర్థులను కంగారు పెట్టడం, దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందడం ఇవన్నీ ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల రాజకీయంగా తమకు పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేకపోయినా, తమ రాజకీయ ప్రత్యర్ధుల్లో ఆందోళన పెంచడమే కాకుండా అదే నిజం అనే భావన కల్పించి కొంతమంది నాయకులైనా ఆ పార్టీకి దూరంగా జరిగేలా చేస్తే వారు తమ పార్టీలోకి వస్తారనే ఆలోచనతో ఈ తరహా పాలిటిక్స్ కు ఎక్కువగా తెర తీస్తున్నట్టుగా కనిపిస్తోంది.


 ఈ విషయంలో ముందుగా కేంద్ర అధికార పార్టీ బిజెపి తెర తీసింది. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు సుమారు పది పన్నెండు మంది టచ్లో ఉన్నారని మొదట్లో హడావుడి చేసింది. మేము ఊ అంటే టిడిపిని వీడి వీరంతా తమ పార్టీలోకి వచ్చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది తమతో టచ్ లో  ఉన్నారని కొద్ది రోజుల్లోనే వీరంతా తమ పార్టీలో చేరడం ఖాయం అని చెప్పారు. అలా చాలా కాలం నుంచి చెబుతూనే వస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ ఆ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపించలేదు. దీంతో ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అని అందరికి అర్ధం అయిపొయింది.


 ఇప్పుడు అదే తరహాలో వైసీపీ కూడా టీడీపీకి చెందిన సుమారు 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా చంద్రబాబు, లోకేష్ తీరుతో అసహనంతో రగిలిపోతున్నారని, తాము చేరికలకు ఒకే అంటే వీరంతా ఏ క్షణమైనా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వైసిపి హడావుడి చేస్తోంది. అయితే ఇదంతా వాస్తవం కాదని, బిజెపి తరహాలో జగన్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ పాలిటిక్స్ కు తెర లేపారని టీడీపీ వాదిస్తోంది. ఇక రాజకీయ విశ్లేషకులు కూడా ఇదంతా వట్టి పుకార్లేనని, అలా జరిగే అవకాశమే లేదంటూ చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: