దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చుసిన 2020-2021 బడ్జెట్ నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ప్రవేశపెట్టారు. అన్ని రంగాలపై వరాల వర్షం కురిపించారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. అయితే ఈ నేపథ్యంలోనే రవాణా శాఖపై వరాల వర్షం కురిసింది.. నిజంగా నిర్మలమ్మ చెప్పిన నిధులు అన్ని ఇస్తే భారత్ రహదారుల అద్దాళ్ళ మెరుస్తాయి అని అంటున్నారు నిపుణులు. 

                            

అవి ఏంటి అంటే.. త్వరలోనే జాతీయ సరకు రవాణా విధానం.. 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారులు ఉండనున్నాయి. ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల అభివృద్ధి జరగనుంది. అలాగే పరిశ్రమలు, వాణిజ్యం ప్రోత్సాహకానికి రూ.27,300 కోట్లు, బెంగళూరు నగరానికి రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం అమలు చేయనున్నారు. 

 

20 శాతం కేంద్రం, అదనపు నిధుల ద్వారా 60 శాతం సమకూర్చేలా ప్లాన్, అలాగే 11 వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాలు విద్యుదీకరణ, రైల్వే ట్రాక్‌ల వెంబడి భారీ సోలార్ విద్యుత్ కేంద్రాలను నిర్మించనున్నారు. ముంబయి నుండి అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు, పర్యాటక రంగ ప్రోత్సాహకానికి త్వరలో మరిన్ని తేజస్‌ రైళ్లను ప్రవేశ పెట్టనున్నారు.  

 

అలాగే రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు ఇవ్వనున్నారు. ప్రతి గడపకు విద్యుత్‌ తీసుకెళ్లడం అతిపెద్ద విజయం అయితే  నదీతీరాల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం చేస్తామని చెప్పారు.. అయితే ఇవ‌న్నీ ఎంత వ‌ర‌కు ఇస్తార‌న్న‌దే ప్రస్తుతానికి స‌స్పెన్స్‌ అనే చెప్పాలి. అయితే నిర్మలమ్మ చెప్పినవి చెప్పినట్టు అన్ని ఇస్తే భార‌త్ ర‌హ‌దారులు అద్దాల్లా మెరిసిపోతాయి అనడంలో ఏలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: