తెలుగు దేశం పార్టీ కి కాలం కలిసి రావట్లేదు లా ఉంది. ఆ పార్టీ మునుపెన్నడూ చూడని ఓటమిని చూసింది గత ఎన్నికల్లో, అప్పటినుండి ఆ పార్టీకి జగన్ రూపంలో కస్టాలు మొదలయ్యాయి. పట్టిందల్లా బంగారం అయ్యే పార్టీకి నేడు బంగారం పట్టుకున్న బొగ్గు ఐపోతుంది. చంద్రబాబు సారథ్యంలో ఆ పార్టీ నాయకులు  పొఱాడుతున్నప్పటికి  కాలం కలిసి రావడంలేదు. బీజేపీతో వివాదం మొదలు  అయినప్పటినుండి ఆ పార్టీ కి కస్టాలు మొదలు అయ్యాయి.

 

     గత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన ఆ పార్టీ తక్కువ ఎంపీ స్థానాలకే పరిమిత మైనది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైకాపా పార్టీ 22 మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని విజయ బావుటా ఎగుర వేసింది. 

 

    ఓం​ బిర్లా  గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్  గదిలో గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే భవనాన్ని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న వైకాపా పార్టీ కి అప్పచెప్పాలని, వైకాపా ఎంపీ సభ్యులు స్పీకర్ ను కోరగా, స్పీకర్ ఆ భవనాన్ని వైకాపా సభ్యులకు కేటాయించారు. గత 30 సంవత్సరాలుగా  టీడీపీ కార్యాలయం  అదే భవనం లో ఎదో ఒక లాలూచి చేసి కొనసాగుతోంది. కావున వారు ఈ భావాన్ని వైకాపా కు ఇచేందుకు మొగ్గు చూపలేదు.

 

       బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఓం​ బిర్లాను విజయసాయిరెడ్డి లేఖ ద్వారా స్పీకర్‌ దృష్టికి ఈ విషయాన్ని  తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్‌ సిబ్బంది మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని  వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: