ఈరోజు పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా నేడు  కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ను పార్లమెంటు వేదికగా చదివి వినిపించారు.ఇక  బడ్జెట్పై అన్ని రాష్ట్రాల  ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకుని... తమ రాష్ట్రానికి సరైన నిధులు కేటాయిస్తారని  ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు . అటు తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానిల నిర్మించేందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశలు పెట్టుకుంటే... కేంద్రం జగన్  ఆశలపై నీళ్లు చల్లింది. 

 

 

 అటు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కు ప్రత్యేక హోదా వస్తుందని... కాళేశ్వరం అభివృద్ధికి మరిన్ని నిధులు కేంద్ర బడ్జెట్లో వస్తాయని ఆశలు పెట్టుకోగా  తెలంగాణ ప్రభుత్వానికి కూడా నిరాశే ఎదురైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తెలుగు  నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నేతలకు  పార్లమెంట్లో నిధులు  అడిగే దమ్ము లేదా... రాష్ట్ర  ప్రయోజనాలకు నిధులు లేకున్నా సరే అనుకుని మోదీకి భయపడి  సైలెంట్ గా ఉంటున్నారా  అని తెలుగు ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 

 

 

 ఆనాడు వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా ప్రభుత్వాన్ని తెలుగు నేతలందరూ  డిమాండ్ చేసి... కమాండ్  చేసి... మంత్రి పదవులను దక్కించుకోవడంతో పాటు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో నిధులు సాధించుకున్నారు . కేంద్రాన్ని గడగడలాడించారు. ఆ  ధైర్యం ఇప్పటి నేతలు మచ్చుకైనా కనిపించడం లేదు అంటూ తెలుగు ప్రజానీకం పెదవి విరుస్తున్నారు. తెలుగు నేతలందరూ కేంద్ర నిధుల కోసం నిలదీసి అడగకపోవడం వల్లే కేంద్ర బడ్జెట్ ల్లో  తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అంటూ విమర్శిస్తున్నారు తెలుగు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: