ఈరోజు పార్లమెంట్ వేదికగా  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టి చదివి వినిపించారు. కేంద్ర బడ్జెట్పై అన్ని  రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి . బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సరైన నిధులు కేటాయిస్తుందా  లేదా అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ముక్యంగా తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా నిరాశ ఎదురైంది. మరోసారి తెలుగు రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్లో వివక్ష చూపినట్లుగా తెలుగు రాష్ట్రాల నేతలు పెదవి విరుస్తున్నారు.  అన్ని రాష్ట్రాలకు వివిధ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క  ప్రాజెక్టును కూడా గుర్తించలేదు కేంద్ర ప్రభుత్వం. 

 

 

 బెంగుళూరులో సబర్మతి రైలు ప్రాజెక్టుకు 18 వేల కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో కేటాయించారు . అటు గుజరాత్ రాష్ట్రానికి కూడా కోట్లాది రూపాయలను బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి . కాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నాయని 31 వేల కోట్లు  లడక్  ఎన్నికలు ఉన్నాయని ఐదువేల కోట్లు బడ్జెట్లో కేటయిస్తూ  ప్రకటన విడుదల చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ని ఏ ఒక్క ప్రాజెక్టును కూడా గుర్తిస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. దీంతో కేంద్ర బడ్జెట్లో పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నేతలు ఆరోపిస్తున్నారు. 

 

 

 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఏ ఒక్కదానికి కూడా ప్రత్యేక హోదా కల్పించి కేంద్ర బడ్జెట్లో నిధులు విడుదల కాలేదు దీనిపై  తెలుగు నేతలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు... తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కేంద్రానికి అసలు ప్రాజెక్టు లాగానే కనిపించలేదా అంటూ తెలుగు రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ హోదా కల్పించి నిధులు  ఇవ్వాల్సింది పోయి కనీస... నిధులు కూడా కేటాయించకపోటవం  సరైనది కాదు అంటూ ఆరోపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో మరోసారి తెలుగోడికి దగాకు  గురయ్యాడు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: