పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న పుకార్లన్నీ నిజమవుతున్నాయి. పవన్ ఫలానా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ కు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడు. ఇలా కొంతకాలంగా చాలా వార్తలు వింటున్నాం. వీటిలో ఒక్కటీ వదిలిపెట్టకుండా అన్నింటినీ పవన్ నిజం చేస్తున్నాడు. పవన్ నటించే మూడో సినిమా సినిమాను ఎనౌన్స్ చేశారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 

 

పవన్ కళ్యాణ్ రీ ఎంటరీ ముందు ఏయే దర్శకుల పేర్లు బయటికొచ్చాయో వాళ్లందరితో సినిమాలు చేస్తున్నాడు. ఆల్ రెడీ రెండు సినిమాలు లాంఛనంగా మొదలయ్యాయి. వీటీని ఎనౌన్స్ చేయకుండా స్టార్ట్ చేస్తే.. మూడో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. పవన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ మూవీని డైరెక్టర్ చేస్తున్నాడు. 


హరీశ్ శంకర్ కెరీర్ లో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హరీష్.. దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ ను పవన్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు మలుచుకున్నాడు. ఒరిజినల్ వెర్షన్ కంటే బాగుందనిపించిన హరీష్.. ప్రస్తుతం పవన్ కోసం కథ రాసుకునే పనిలో ఉన్నాడు. 

 

పవన్ మళ్లీ సినిమాల్లో నటించడంతో జనసేన పార్టీకి జెడి లక్ష్మీనారాయణ రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా తనను నమ్ముకున్న వాళ్లకోసం.. పార్టీ కోసం నటించాల్సి అవసరాన్ని పవన్ తెలిపాడు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే.. మూడో సినిమాను ప్రకటించారు. పింక్ రీమేక్ లో పవన్ 20 రోజులు నటిస్తే చాలు సినిమా పూర్తవుతుంది. ఇందులో లాయర్ గా నటిస్తున్నాడు పవన్. క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ ఏడాదంతా పవన్ సెట్స్ పైనే ఎక్కువగా కనిపిస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: