అమరావతి సెగలు పార్టీల్లో కుంపటి పెడుతోంది. మూడు రాజధానులకు ఏపీలోని సీమాంధ్ర నాయకులు సానుకూలంగా ఉండగా.. కేవలం గుంటూరు జిల్లాకు చెందిన 39 గ్రామాలు ప్రజలు, నాయకులు మాత్రమే వ్యతిరేఖంగా ఉద్యమిస్తున్నారు. అయితే ప్రజల డిమాండ్​ ఎలా ఉన్నా.. రాజకీయ పార్టీల్లో రాజధాని అంశం చీలికలు తెస్తోంది. ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే రాపాకపార్టీ అధినేతను దిక్కరించి మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేశాడు. అటు బీజేపీ, కాంగ్రెస్​లోనూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు నాయకులు బహిరంగంగానే మూడు రాజధానులకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు లోలోపల కుములుతూనే.. బయటకు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.  

 

కాగా ఇదే అంశంపై కర్నూలు జిల్లా నాయకులు టీడీపీ షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇన్​ చార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడికి షాక్​ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఆ లేఖను అధినేతకు పంపించారు. అనంతరం విక్టర్​ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని టీడీపీకి లేదని విమర్శించారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకుంటని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు తనను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

 
కర్నూలు అభివృద్ధి చెందడం, హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ అంశాలన్నీ తనకు బాధకలించడం వల్లనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విక్టర్ చెప్పారు. ఇప్పటికైనాతెలుగుదేశం నాయకులు తన అభిప్రాయాలను మార్చుకోని రాష్ట్రాభివృద్ధికి పాలుపడాలని హితువు పలికారు. అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదనే జగన్​ మూడు రాజధానులు చేస్తున్నారని, దీనిని రాష్ట్ర ప్రజలు స్వాగతించాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: