దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిన్న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టారు. అయితే ఈ కేంద్ర బడ్జెట్ లో కొన్ని రంగాలపై వరాల జల్లు కురిస్తే మరికొన్ని రంగాలకు మొండి చెయ్యి చూపించారు. అయితే బడ్జెట్ కి ముందు ఎన్నో చెప్పిన కేంద్రం బడ్జెట్ లో ఏమి లేదు అని తేలిపోయింది. 

                

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన బడ్జెట్ లో ఈ రాష్ట్ర ప్రజల కోసం  బడ్జెట్ లో ఒక్క రూపాయి లేకపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాలు వైఎస్‌ను మిస్ అయ్యాయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే.. వైఎస్ఆర్ ముండివాడు.. రాష్ట్రం కోసం ఎవరితోనైనా పోరాడగల శక్తి ఉన్నవాడు.  

                  

బడ్జెట్ సమావేశాల్లో అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొండి వారు కాబట్టి కేంద్రం మెడలు వంచి మరి రాష్ట్రం కోసం బడ్జెట్ తెచ్చేవాడు. ప్రతి బడ్జెట్ లో రాష్ట్రంపై ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూసేవాడు. అదికూడా ఉమ్మడి రాష్ట్రానికి కేంద్రం నుండి బడ్జెట్ తీసుకోవచ్చేవాడు. కానీ అయన మరణం తర్వాత ఇప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రం రెండుగా చీలింది. 

             

ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు.. కానీ కేంద్ర నుండి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయారు.. నిజానికి అప్పట్లో కేంద్రంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అవ్వడంతో కేంద్ర బడ్జెట్ తెచ్చుకోడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఏ సీఎం ని దూషించకపోయిన కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ విషయంలో తీరని అన్యాయం చేసింది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: