రోజురోజుకు స్మార్ట్ ఫోన్ వాడకం ఎంతగానో పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక స్మార్ట్ఫోన్ వాడేవారైతే స్మార్ట్ఫోన్ ప్రపంచంగా బతికేస్తున్నారు. ఫోన్లో చూస్తూనే అన్ని పనులు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో చూస్తూనే రోడ్డు క్రాస్ చేస్తుండడం... స్మార్ట్ ఫోన్ లో చూస్తూనే ఇంకేదైనా పనిచేస్తుండడం లాంటివి చేస్తున్నారు. ఇలా స్మార్ట్ఫోన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే స్మార్ట్ఫోన్ వల్లనే కాదు హెడ్ ఫోన్స్ వల్ల కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఫోన్ కి ఛార్జింగ్ పెడుతూ పాటలు వినడం వల్ల... కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది. 

 

 

 అంతేకాకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ట్రాఫిక్ లో నడుస్తున్న సమయంలో వెనక నుంచి వస్తున్న వాహనం  హారన్  వినిపించక పోయేసరికి... ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఏకాంతంగా ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినాలి కానీ... ట్రాఫిక్ లో ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి కదా. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్ళాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఇక  వెనుక  నుంచి  వస్తున్న ట్రైన్ ఎన్ని సార్లు హారన్  కొట్టినప్పటికీ కూడా ఆ వ్యక్తికి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న కారణంగా ట్రైన్ సౌండ్ వినిపించలేదు. 

 

 

 దీంతో ట్రైన్ ఆ వ్యక్తిని ఢీ కొట్టింది కాగా  ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే... చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టిన ఘటన  కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి శనివారం కాచిగూడ విద్యానగర్ రైల్వే స్టేషన్ల మధ్య... తిలక్ నగర్ బ్రిడ్జి సమీపంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని... పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటూ కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలును ఆ వ్యక్తి గమనించక పోవడంతో అతన్ని రైలు ఢీ కొట్టింది దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు అంటూ తెలిపారు రైల్వే  ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు. తాజా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: