కరోనా  వైరస్ ఈ పేరు చెబితేనే... ప్రాణ భయంతో గజగజ వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాలో గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రాణభయంతో ఊపేస్తోంది. ఇప్పటికే ఈ మాయదారి ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి వందల మంది  ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఈ కరోనా వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. చైనాలోని ఊహాన్  నగరంలో మొదట గుర్తించబడిన ఈ వ్యాధి... ప్రస్తుతం చైనా వ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో చైనా లో ఉండే హాస్పిటల్ కూడా ఈ వ్యాధి బారిన పడిన వారికి సరిపోవడం లేదు. అంతేకాకుండా కరోనా వైరస్ బారిన పడిన వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు. 

 

 

 అటు ప్రపంచ దేశాలు కూడా కరోనా  వైరస్ తో జన్మలెత్తి పోతున్నాయి. కరోనా  వైరస్ చైనాలో శరవేగంగా వ్యాప్తిచెండుతుండటంతో  ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మనుషులకు ప్రాణం మీద తీపి ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మనిషి ప్రాణం మీదికి వచ్చింది అంటే ఇతరుల ప్రాణాలు తీయడానికి అయినా వెనుకాడరు. ప్రస్తుతం చైనాలో ఇలాంటిదే జరుగుతోంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ చైనాలో అతి వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు భయం గుప్పిట్లో ని బతుకు వెళ్లదీస్తున్నారు. కరోనా  వైరస్ చైనా ప్రజల పై ఎంత ప్రభావం చూపింది అంటే కనీస మానవత్వం మరిచి ప్రవర్తించేలా ప్రభావితం చేస్తుంది. 

 

 

 కరుణ వైరస్ మనుషుల నుండి మనుషులకు కాకుండా... జంతువుల నుంచి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి... చైనా ప్రజలు ఎంతో మంది కఠినాత్ములు గా తయారవుతున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు జంతువులను.. ప్రాణభయంతో అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఎక్కడ తమ పెంపుడు జంతువుల నుంచి తమకు కరోనా వైరస్ సోకి తమా  ప్రాణాలు పోతాయోనని  భయపడి... అతి దారుణంగా పెంపుడు జంతువుల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో ఎక్కడ చూసినా రోడ్డుమీద చనిపోయిన పెంపుడు జంతువులే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్లింగ్ లో నుంచి పెంపుడు జంతువుల యజమానులు కిటికీల్లోంచి రోడ్డుమీదికి  పడేయడంతో అవి కింద పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఎక్కడ చూసినా ఇదే తీరు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: